జానీ మాస్టర్ (Jani Master) విషయంలో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయంలో ఇప్పటివరకు జానీ మాస్టర్ కు డైరెక్ట్ గా లేదా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేసినవాళ్లెవరు లేరు. మొట్టమొదటిసారిగా ఓ పెద్ద సెలబ్రిటీ జానీ మాస్టర్ కు పరోక్షంగా సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. అది కూడా జానీ గోవాలో పోలీసులకు దొరికిపోయిన క్షణం నుండే. ఇవాళ నాగబాబు (Naga Babu) తన ట్విట్టర్ ఎకౌంట్ నుండి రెండు ట్వీట్లు వేసాడు.
Naga Babu
ఒకటేమో “కోర్టులో నేరం రుజువయ్యేదాకా ఎవరు నేరస్తులు కాదు” అని, ఇంకోటేమో “వినిపించే ప్రతి కథను నమ్మకండి.. ప్రతి కథలోనూ మూడు కోణాలుంటాయి.. ఒకటి వాళ్లది, మరొకటి వీళ్లదు, మూడోది నిజం” అంటూ నాగబాబు వేసిన ట్వీట్స్ పరోక్షంగా జానీ మాస్టర్ నిర్దోషి అని వాదిస్తున్నట్లుగా లేక హింట్ ఇస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి. జానీ మాస్టర్ పర్సనల్ గా & ప్రొఫెషనల్ గా మెగా ఫ్యామిలీకి చాలా దగ్గర అనే విషయం తెలిసిందే. జానీ జనసేనలోనూ క్రియాశీలక పాత్ర పోషించాడు.
మరి అందుకే నాగబాబు సపోర్ట్ చేస్తున్నాడా లేక ఆయనకు జానీ & లేడీ కొరియోగ్రాఫర్ విషయంలో జరిగిన తంతు మొత్తం తెలుసా? వంటి విషయాలు తెలియాల్సి ఉంది. ఇకపోతే.. ప్రస్తుతం జానీ మాస్టర్ ను హైదరాబాద్ తీసుకొస్తున్నారు పోలీసులు. రేపు ఉదయం ఉప్పరపల్లి కోర్టులో అతడిని ప్రవేశ పెడతారు. ఈ క్రమంలో ఇవాళ జానీ మాస్టర్ భార్య అయేషాను నార్సింగి పోలీసులు స్టేషన్ కు ప్రశ్నించడానికి తీసుకొచ్చారు.
మరి ఈ కేస్ విషయంలో పురోగతి ఏంటి అనేది రేపటికి ఒక క్లారిటీ వస్తుంది. అయితే.. ఈపాటికే సోషల్ మీడియా మొత్తం జానీ నిందుతుడు అని నిర్ధారణకు వచ్చేసింది. రేపు అతడ్ని కోర్టులో ప్రవేశపెట్టే సమయంలో తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని పోలీసులు బందోబస్త్ కూడా పకడ్బందీగా ప్లాన్ చేశారు.
No person can be considered guilty of a crime until he or she has been found guilty of that crime by a court of law.
:- Sir William Garrow