RGV, Naga Babu: మొదటి సారి ఆర్జీవీకి మద్దతు ఇస్తున్న నాగబాబు..!
- January 4, 2022 / 10:07 PM ISTByFilmy Focus
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా థియేటర్ల విషయంలోనూ.. టికెట్ రేట్ల విషయంలోనూ కఠిన నిర్ణయాలు తీసుకుంటూ పెద్ద సినిమాల విడుదలకి అడ్డుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ఏపి ప్రభుత్వం తీరు పై పలువురు సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వచ్చారు.నాని, సిద్దార్థ్ వంటి హీరోలు ఇప్పటికే ఈ విషయాల్లో స్పందించి విమర్శల పాలయ్యారు.అయితే ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు రాంగోపాల్ వర్మ గత రెండు మూడు రోజులుగా టికెట్ రేట్ల ఇష్యు పై…

అలాగే ఏపి ప్రభుత్వం తీరుని తప్పు పడుతూ వరుసగా వీడియోలు చేస్తూ.. పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్నాడు. ఎన్నడూ లేని విధంగా రాంగోపాల్ వర్మ ఇంతలా పాజిటివ్ గా రియాక్ట్ అవుతుండడంతో సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ పార్టీ నేతలతో స్నేహ బంధం ఉన్నప్పటికీ.. రాంగోపాల్ వర్మ ఇలా జెన్యూన్ గా రియాక్ట్ అవ్వడం సంతోషించదగ్గ విషయమే. గతంలో రాంగోపాల్ వర్మ తీరు పై అసహనం వ్యక్తం చేస్తూ పరోక్షంగా కామెంట్లు చేసిన నాగబాబు ఇప్పుడు రాంగోపాల్ వర్మ కామెంట్స్ ను ఏకీభవిస్తుండడం విశేషం.

విషయంలోకి వెళితే.. ఏపి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఓ వీడియోని వర్మ యూట్యూబ్లో షేర్ చేసాడు. దీనిని చూసిన తర్వాత నాగబాబు ఈ వీడియో పై ట్విట్టర్లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ కామెంట్స్ పెట్టాడు. ‘రాంగోపాల్ వర్మ చెప్పింది పూర్తి గా నిజం. నా నోటి వరకు వచ్చిన ప్రశ్నలను ఆర్జీవీ బయటపెట్టారు’ అంటూ ఆయనకి మద్దతు పలికాడు. ఇప్పుడు ఈ ట్వీట్ కాస్త వైరల్ గా మారింది.
You're absolutely right… And you took the questions right out of my mouth… @RGVzoomin https://t.co/OcePNWtnNj
— Naga Babu Konidela (@NagaBabuOffl) January 4, 2022
2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!














