ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి ముద్దు ఒక్కసారే ఉంటుంది. అయితే సినిమా వాళ్లకు మాత్రం రెండు సార్లు ఉంటుంది. ఒకటి ఆన్‌స్క్రీన్ అయితే, రెండోది ఆఫ్ స్క్రీన్. అయితే రెండో విషయం ఎప్పుడు అనేది చెప్పమంటే సినిమా వాళ్లు చెప్పకపోవచ్చు కానీ.. మొదటి ఆన్‌స్క్రీన్ ఈజీగా చెప్పేయొచ్చు. అలా ఈ విషయాన్ని అక్కినేని నాగచైతన్య దగ్గర ప్రస్తావిస్తే ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు. వెంకట్ ప్రభుతో కలసి ఆయన చేసిన ‘కస్టడీ’ సినిమా ప్రచారంలో భాగంగా నాగచైతన్య మీడియాతో మాట్లాడాడు.
ఆ సందర్భంలో నెపోటిజం గురించి కూడా మాట్లాడాడు. ఎక్స్ కపుల్ (Naga Chaitanya) నాగచైతన్య, సమంత కలసి నటించిన చిత్రం ‘ఏ మాయ చేసావె’. ఈ సినిమా వచ్చి 13 ఏళ్లు పూర్తయింది కూడా. ఆ సినిమా చైతు, సామ్ మధ్య కిస్ సీన్ ఉంటుంది. అందుకనే ఫస్ట్ కిస్, ఫస్ట్ డేట్‌పై స్పందించమని చైతుని మీడియా ప్రతినిధి అడగ్గా.. ‘ఏ మాయ చేసావె’ సినిమాలోనే తాను ఫస్ట్ టైమ్ ఆన్‌స్క్రీన్ కిస్ సన్నివేశంలో నటించనట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఫస్ట్ డేట్ గురించి మాట్లాడుతూ ఆరో తరగతో, ఏడో తరగతో కానీ.. ఆ టైమ్‌లో ఫస్ట్ టైమ్ క్లాస్‌మేట్‌ని ఇష్టపడ్డాను. ఇంటర్‌లో ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ కోసం కాఫీ షాప్‌కు వెళ్లాను అని చెప్పాడు. ఇక అమ్మాయి విషయంలో ఏం గమనిస్తారు అని అడిగితే.. అమ్మాయిలో నేను మొదట గమనించేది వ్యక్తిత్వాన్నే అని చెప్పాడు. ఇక అన్ ఎండింగ్ టాపిక్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అయిన నెపోటిజం గురించి కూడా చైతు మాట్లాడాడు. నెపోటిజంను ఎందుకు ఇంతలా చర్చిస్తున్నారో అర్థం కావడం లేదు.
సినిమా పరిశ్రమకు చెందిన ఫ్యామిలీలో పుడితే ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలా సినిమాలపై ఆసక్తి కలిగి, అందులోకి వస్తారు. అందులో తప్పు లేదు కదా. నేను కూడా అలాగే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. ఆ తర్వాత కష్టపడే ఈ స్థాయికి వచ్చాను. ఇక సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పుడు ఫ్యామిలీలో ఉన్న ఇతర హీరోలతో పోల్చి చూస్తారు. అలా నన్ను కూడా పోలుస్తుంటారు. దాన్ని సవాలుగా తీసుకుని కష్టపడి వాళ్ల స్థాయికి వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాను అని నెపోటిజం వల్ల వచ్చే ఆ తీపి కష్టం గురించి కూడా చెప్పాడు చైతన్య.
రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!
గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?