Naga Chaitanya: ప్లాపులు గురించి నాగ చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

అక్కినేని ఫ్యామిలీకి 2022 ఆరంభంలో సక్సెస్ దొరికింది. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ‘బంగార్రాజు’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. అయితే ఆ తర్వాత వచ్చిన నాగార్జున, నాగ చైతన్య.. సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ‘థాంక్యూ’ ‘ఘోస్ట్’ సినిమాలు ప్లాప్ అవ్వగా.. వీరు బాలీవుడ్లో చేసిన ‘బ్రహ్మాస్త్ర’ ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమాలు కూడా నిరాశపరిచాయి. ఇక ఇటీవల వచ్చిన ‘ఏజెంట్’ సినిమా కూడా తీవ్రంగా నిరాశపరిచింది.

సో అక్కినేని ఫ్యామిలీకి అర్జెంట్ గా ఓ సూపర్ సక్సెస్ కావాలి. నాగార్జున అయితే ప్రసన్న కుమార్ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాడు. నాగ చైతన్య అయితే ‘కస్టడీ’ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మే 12 న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రం ప్రమోషన్లలో అక్కినేని ఫ్యామిలీ వరుసగా ప్లాపులు ఫేస్ చేస్తుంది అనే ప్రశ్న నాగ చైతన్యకి ఎదురైంది. దీనికి చైతన్య సమాధానం ఇస్తూ.. “హిట్స్ అండ్ ప్లాప్స్ అనేవి ఎవ్వరికైనా సర్వసాధారణం.

ఒక బ్యాడ్ ఫేస్ అనేది ఉంటుంది. వద్దనుకున్నా.. అందరూ ఆ ఫేస్ తో ట్రావెల్ చెయ్యాలి. ఆ ట్రావెల్ లో చాలా విషయాలు నేర్చుకుంటారు. ఇక అభిమానుల కోసం తప్పకుండా ఓ హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. ‘కస్టడీ’ సినిమాతో సక్సెస్ కొడతాం అనే కాన్ఫిడెన్స్ ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు. ‘కస్టడీ’ సినిమా (Naga Chaitanya) నాగ చైతన్య.. శివ అనే కానిస్టేబుల్ పాత్రలో కనిపించబోతున్నాడు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus