అక్కినేని కాంపౌండ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నాగ చైతన్య తాను నటించి సినిమా రిజల్ట్స్‌తో పనిలేకుండా తన పని తాను చేసుకుంటూపోతున్నాడు. ఇక చైతూ నటిస్తున్న తాజా చిత్రం లవ్‌స్టోరీ. టాలీవుడ్ మిస్టర్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నేచురల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తోంది. విలేజ్ టు సిటీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ప్రేమకథే ఈ లవ్‌స్టోరీ మూవీ మెయిన్ కథ.
ఇక అసలు విషయంలోకి వెళితే.. ఈ ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ నుండి దీపావళి కానుకగా ఓ పోస్టర్‌ను విడుదల చేశారు లవ్‌స్టోరీ మేకర్స్. పెళ్లి పీటల పై నాగ చైతన్య, సాయిపల్లవిల జంట చూసేందుకు కనులవిందుగా ఉంది. మైమరపించే నవ్వులతో, కళ్ళతోనే ఒకరి పై మరొకరు తమ మనసులోకి భావాలను వ్యక్తపరిచేలా ఉన్న ఆ పోస్టర్ వావ్ అనిపిస్తోంది. ఆ పోస్టర్‌ను చూస్తుంటే ఈ మూవీ పల్లవి-చైతూల కెమిస్ట్రీ ఏ రేంజ్లో ఉండబోతుందో అర్ధమవుతోంది.
అయితే ఇక్క షాకింగ్ మ్యాటర్ ఏంటంటే.. లవ్‌స్టోరీ లేటెస్ట్ పోస్టర్ పై సమంత రియక్షన్ పై సర్వత్రా ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఈ మూవీ తొలిపోస్టర్ రిలీజ్ అయినప్పుడు, ఎమోషనల్‌గా చైతన్య చొక్కా పట్టుకున్న సాయిపల్లవికి బ్రహ్మానందం మీమ్స్‌తో వార్నింగ్ ఇచ్చిన సమంత, ఆ తర్వాత మ్యూజికల్ ప్రివ్యూ పేరుతో విడుదల చేసిన ఏ పిల్లా సాంగ్ టీజర్ చివరిలో నాగ చైతన్యను సాయిపల్వి ముద్దుపెట్టుకోవడంతో, ఆ సీన్ తనను షాక్‌కు గురి చేసిందని సామ్ కామెంట్స్ చేసింది.
అయితే ఇప్పుడు చైతన్య ఏకంగా పల్లవితో పెళ్లి పీటలే ఎక్కేశాడు. దీంతో ఇప్పుడు ఈ పోస్టర్ చూసి ఒకవైపు అక్కినేని అభిమానులు మురిసిపోతుండగా మరోవైపు సమంత ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కొందరైతే సోషల్ మీడియాలో సమంతతో జాగ్రత్త సాయిపల్లవి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఏది ఏమైనా దీపావలి పండుగ వేల అక్కినేని అభిమానులు మురిసిపోయేలా లవ్‌స్టోరీ మేకర్స్ మంచి ట్రీట్ ఇచ్చారని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!