కింగ్ నాగార్జున ఓ వైపు “ఓం నమో వెంకటేశాయ” సినిమాలో నటిస్తూనే మరో వైపు కొడుకుల పెళ్లిళ్ల పనుల్లో క్షణం తీరికలేకుండా తిరుగుతున్నారు. మొదట చిన్న కొడుకు పెళ్లి జరగనుంది. డిసెంబరు 9న అఖిల్, శ్రియా భూపాల్‌ల నిశ్చితార్థం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ, వాణిజ్య తదితర రంగాల ప్రముఖులను నాగార్జున ఆహ్వానిస్తున్నారు.
నిశ్చితార్థం ఇక్కడ జరిపినా వచ్చే ఏడాది మే నెలలో జరిగే కల్యాణానికి రోమ్ వేదిక కానుంది. చిన్న కొడుకు వివాహ సంబరం పూర్తి అయిన వెంటనే పెద్ద కొడుకు నాగ చైతన్య పెళ్లి గంటలు మోగనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో వీరి పెళ్లి వేడుక జరపాలని అక్కినేని ఫ్యామిలీ అనుకుంటున్నారు. తొలుత హిందూ సంప్రదాయం ప్రకారం, తర్వాత క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనున్నట్లు తెలిసింది. సో వచ్చే ఏడాది మొత్తం నాగ్ బిజీ బిజీ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.