Naga Chaitanya, Sobhita Dhulipala: చై- శోభిత..ల పెళ్లి ప్లేస్ ఫిక్స్ అయ్యిందా..?!

అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) .. సమంతతో (Samantha) విడాకులు తీసుకుని 3 ఏళ్ళు పూర్తి కావస్తోంది. సమంతతో విడిపోయాక.. కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న చైతన్య, ఆ తర్వాత హీరోయిన్ శోభిత ధూళిపాళతో (Sobhita Dhulipala) ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. కానీ వీటి పై చైతన్య, శోభిత.. వెంటనే క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ వీళ్ళ పాత ఫోటోలు హాట్ టాపిక్ అయ్యేవి. కొన్నాళ్ల తర్వాత వీళ్ళ డేటింగ్ వ్యవహారాల గురించి అందరూ మర్చిపోయారు. అలాంటి టైంలో ఇద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకుని పెద్ద షాక్ ఇచ్చారు.

Naga Chaitanya, Sobhita Dhulipala:

నాగార్జున ఇంట్లోనే వీరి నిశ్చితార్ధ వేడుక జరిగింది. దానికి సంబంధించిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి. ‘శోభితని మా అక్కినేని కుటుంబంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం’ అంటూ నాగార్జున (Nagarjuna) ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. నాగ చైతన్య- శోభిత..ల ఎంగేజ్మెంట్ జరిగి చాలా రోజులు అయ్యింది. కానీ వీరి పెళ్లి గురించి మాత్రం ఎటువంటి డీటెయిల్స్ ఇచ్చింది లేదు. చైతన్య – శోభిత..లు కలిసి ఉన్న ఓ ఫోటో ఇటీవల తెగ వైరల్ అయ్యింది.

అందులో బ్లాక్ ఔట్-ఫిట్స్ లో వీళ్ళు చాలా స్టైలిష్ గా కనిపించారు. ఆ ఫోటోలకి రకరకాల కామెంట్లు వచ్చాయి. వాటిలో ఎక్కువగా చై- శోభిత..ల పెళ్లి ఎప్పుడు? అనే ప్రశ్న ఎక్కువగా ఉంది అని చెప్పాలి. నిన్నటికి నిన్న పెళ్ళికి ముందు పసుపు కొమ్ములు పట్టుకుని, పట్టు చీరలో శోభిత కనిపించింది. దీంతో త్వరలోనే చై- శోభిత..ల పెళ్లి ఉంటుందని అంతా భావిస్తున్నారు.

వీరి పెళ్లి డేట్ సంగతి పక్కన పెట్టేస్తే.. పెళ్లి ప్లేస్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఈసారి హైదరాబాద్లోనే చైతన్య పెళ్లి వేడుకను నిర్వహించబోతున్నారట. అతి తక్కువ మంది సెలబ్రిటీలు, బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి వేడుక జరుగుతున్నట్టు స్పష్టమవుతుంది.

రాజా సాబ్.. ఆడియో రైట్స్ ఎంతంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus