The Rajasaab: రాజా సాబ్.. ఆడియో రైట్స్ ఎంతంటే..!

టాలీవుడ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస సినిమాలతో ఫ్యాన్స్‌ కు మంచి కిక్ ఇస్తున్నాడు. ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) వంటి బిగ్ హిట్ తర్వాత, ఆయన ఫోకస్ మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ‘ది రాజా సాబ్’ (The Rajasaab) పై ఉంది. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి (Maruthi Dasari) తెరకెక్కిస్తున్న ఈ సినిమా హర్రర్ కామెడీ జానర్‌లో ఉండనుందని ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చేశారు. అనౌన్స్‌మెంట్ లేకుండానే, ఈ ప్రాజెక్ట్ షూటింగ్ గడచిన కొంత కాలంగా సీక్రెట్‌గా కొనసాగుతోంది.

The Rajasaab

షూటింగ్ జెట్ స్పీడ్‌లో జరుగుతుండటంతో, ఈ మూవీపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇటీవల విడుదలైన ‘ఫ్యాన్ ఇండియా గ్లింప్స్’ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులు దీన్ని ప్రశంసించారు. ఇప్పుడు రాజా సాబ్ మూవీకి సంబంధించి బిజినెస్ పార్ట్ కూడా ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆడియో రైట్స్ భారీ ధరకు అమ్ముడైపోయాయి.

ప్రముఖ మ్యూజిక్ కంపెనీ టీ సిరీస్ ఏకంగా రూ. 25 కోట్ల మేరకు ఆడియో రైట్స్ డీల్ ముగించిందని ట్రేడ్ వర్గాల సమాచారం. థమన్ (S.S.Thaman) మ్యూజిక్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ రికార్డ్ డీల్ కుదిరిందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ (Pushpa 2) , ‘గేమ్ చేంజర్’(Game Changer)   వంటి పెద్ద సినిమాలకు కూడా భారీ మొత్తాల్లో ఆడియో రైట్స్ అమ్ముడవడం తెలిసిందే. ఇప్పుడు ‘ది రాజా సాబ్’ కూడా అదే రేంజ్‌లో రైట్స్ సాధించడం విశేషం.

థమన్ ఈ చిత్రానికి మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారట. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్ (Nidhhi Agerwal), మాళవిక మోహనన్  (Malavika Mohanan) , రిధిలు నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్(Sanjay Dutt)  కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్‌ను చూసేందుకు ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మరి ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో మరో సూపర్ హిట్ గా నిలుస్తుందో లేదో చూడాలి.

వీరమల్లు.. ఆ 20 నిమిషాలే అసలైన ఊచకోత!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus