Naga Chaitanya: సమ్మర్‌ హీట్‌లో చైతు హంటింగ్‌.. కీలక అప్‌డేట్‌ ఇదిగో!

నాగచైతన్య పోలీసు లుక్‌లో సూపర్‌గా ఉంటాడు. కానీ పుల్‌ ప్లెడ్జ్‌ పోలీసు రోల్‌లో మాత్రం ఇన్నాళ్లూ కనిపించలేదు. అడపాదడపా నిమిషాల సీన్స్‌లో కనిపించాడు. ఇలా అనుకుంటున్న వాళ్ల కోరికను మన్నించి చైతు ఇప్పుడు పోలీసు పాత్ర పోషిస్తున్నాడు. సారీ సారీ పోషించాడు. అదేంటి అంటున్నారా? ఎందుకంటే ఆయన పోలీసు పాత్రలో చేస్తున్న ‘కస్టడీ’ షూటింగ్‌ పూర్తయింది. ఈ మేరకు సినిమా టీమ్‌ స్పెషల్‌ వీడియోను రిలీజ్‌ చేసింది. నాగచైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో వెంకట్‌ ప్రభు తెరకెక్కిస్తున్న చిత్రం ‘కస్టడీ’.

ఈ సినిమా షూటింగ్‌ పూర్తయినట్లు ఓ స్పెషల్‌ వీడియోతో చిత్రబృందం ప్రకటించింది. దాంతో పాటు సినిమా రిలీజ్‌ డేట్‌ను కూడా అనౌన్స్‌ చేశారు. ‘మే 12న మీ అందరినీ మా కస్టడీలోకి తీసుకుంటాం’ అంటూ నాగచైతన్య, కృతి శెట్టి ప్రేక్షకులకు తెలియజేశారు. శుక్రవారంతో ఈ సినిమా చిత్రీకరణ పూర్తవ్వడంతో ఆఖరి షాట్‌ చిత్రీకరణను వీడియోగా చిత్రీకరించి విడుదల చేశారు. వీడియో ఆఖరులో ‘కట్‌.. చైతు నీకు మా కస్టడీ నుండి విడుదల’ అంటూ వెంకట్‌ ప్రభు చెప్పారు.

నాగచైతన్య కెరీర్‌లోనే అత్యధిక వ్యయంతో రూపొందుతున్న చిత్రమిది. రేవతి అనే యువతి పాత్రలో కృతి నటించింది. అరవింద్‌ స్వామి ప్రతినాయకుడిగా నటించగా, ప్రియమణి ఓ కీలక పాత్రలో కనిపించనుంది. ‘కస్టడీ’ సినిమాను గతేడాది సెప్టెంబరులో ప్రారంభించారు. అప్పటి నుండి విరామం లేకుండా షూటింగ్ చేశారు. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు షురూ చేస్తారు. దీని కోసం దాదాపు మూడు నెలలు పట్టొచ్చు అంటున్నారు.

ఇప్పటికే పాత్రల పేర్లు, తదితర వివరాలను ఎప్పటికప్పుడు టీమ్‌ పోస్టర్ల రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అన్నట్లు ఈ సినిమాకు ఇద్దరు స్టార్ సంగీత దర్శకులు పనిచేస్తుండటం విశేషం. ఒకరు ఇళయరాజా అయితే మరొకరు యువన్‌ శంకర్‌ రాజా. ఇక ఈ సినిమాకు వెంకట్‌ప్రభు ‘హంట్‌’ అనే ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. అంటే మే 12న చైతు హంట్‌ మొదలవుతుంది అన్నమాట.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus