నాగ చైతన్య అనగానే అక్కినేని ఫ్యామిలి, నాగార్జున కోడుకు, వెంటేష్ అల్లుడు అతనికి ఏమి కష్టాలు ఉంటాయిలే అని అందరూ అనుకుంటారు. కానీ నాగచైతన్య జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి.. ఎదురైన ప్రతి సంఘటన నుంచి చైతూ ఏదో ఒక పాఠం నేర్చుకుంటూనే ఉన్నానని తెలిపారు.. కానీ ‘నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు..’ అని అన్నారు యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ఆయన హీరోగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘కస్టడీ’. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 12న విడుదల కాబోతోంది.
ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్‌ను యమా జోరుగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో సినిమా విశేషాలతో పాటు తన వ్యక్తిగత విషయాల గురించి కూడా మాట్లాడారు. ‘‘నా లైఫ్‌లో ఇప్పటివరకు ఎలాంటి బాధాకరమైన సంఘటనలు లేవు.. బాధపడలేదు. కానీ కొన్ని సినిమా కథల విషయంలో బాధపడ్డా. ఆ సినిమా కథపై సరైన నిర్ణయం తీసుకోలేకపోయానే అని అనుకుంటూ ఉంటాను. అలాగే ఆ సినిమాలతో ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను.
ముఖ్యంగా ఇది మూడు సినిమాల విషయంలో జరిగింది’’ అని నాగ చైతన్య చెప్పుకొచ్చారు. అయితే జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా.. అంత ధైర్యంగా నిలబడటం చైతూకే సాధ్యం అనేలా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా నాగ చైతన్య లైఫ్‌లో ఏం జరిగిందనేది అందరికీ తెలిసిందే. ఒక్క విడాకులు అనే కాదు.. ఆయన చిన్నప్పటి నుంచి, ఎన్నో బాధలను దిగమింగుకుంటూ పెరిగారు. సమంత తో పెళ్లి తర్వాత హ్యాపీగా ఉంటారని అంతా అనుకుంటే..
అది మూడునాళ్ల ముచ్చటగానే ముగిసిపోయింది. ఆమెతో విడాకుల తర్వాత కూడా (Naga Chaitanya) చైతూ తన పని తాను చేసుకుంటూ.. ఎప్పుడూ ఆనందంగానే ఉన్నట్లుగా కనిపిస్తుంటారు. మనసులో ఎంత బాధ ఉన్నా.. ముఖంపై మాత్రం చిరునవ్వును చెరగనీయడు.. అతనికి ఓర్పు, సహనం ఎక్కువ. అందుకే ఎలాంటి విషయాన్ని అయినా పాఠంగానే భావిస్తున్నానని చెబుతున్నాడు.. అంటూ ఈ ఇంటర్వ్యూ తర్వాత చైతూ గురించి అభిమానులు మాట్లాడుకుంటుండటం విశేషం.
ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!
బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా