Naga Chaitanya: జీవితంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు: నాగ చైతన్య

నాగ చైతన్య సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత పూర్తిగా తన దృష్టిని సినిమాలపై పెట్టారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు, వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ బంగార్రాజు వంటి బ్యాక్ బ్యాక్ హిట్ సినిమాలను సొంతం చేసుకున్న నాగచైతన్య తాజాగా థాంక్యు సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య రాశిఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తుండగా, అవికాగోర్ కీలక పాత్రలో సందడి చేయనుంది.

రొమాంటిక్ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని జూలై 8 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సినిమాకు సంబంధించిన అప్డేట్ విడుదల చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ నాగచైతన్య నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండడంతో ఈ టీజర్ లో చైతన్య చెప్పిన డైలాగ్స్ కు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

మీరు తప్ప నా లైఫ్ లో ఇంకెవరూ లేరు..లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు జీవితంలో ఎన్నో వదులుకొని ఇక్కడి వరకు వచ్చాను, నన్ను నేను సరి చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది అంటూ ఆయన చెప్పిన డైలాగ్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా టీజర్ లో భాగంగా చైతన్య చెప్పిన డైలాగ్స్ కు అతని నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉండడంతో ఈ టీజర్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.

18 సెకండ్ల నిడివిగల ఈ టీజర్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇకపోతే ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా సందడి చేయనున్నారు. ఇలా లవ్ ట్రాక్, రొమాంటిక్ సన్నివేశాలతో రూపొందిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పవచ్చు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus