Naga Chaitanya: ఆ ఇండస్ట్రీలో సత్తా చాటాలనే చైతన్య కోరిక తీరుతుందా?

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలంతా పాన్ ఇండియా కథలపై, పాన్ ఇండియా సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఇతర భాషల్లో సైతం సత్తా చాటాలని ఇతర ఇండస్ట్రీలలో కూడా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. కస్టడీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. కస్టడీ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ బాగానే ఉన్నాయి. చెన్నైలో కస్టడీ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈ ఈవెంట్ లో చైతన్య మాట్లాడుతూ కోలీవుడ్ ఇండస్ట్రీ అభిమానుల నుంచి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చిందని ఈ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందని చైతన్య చెప్పుకొచ్చారు.

తమిళంలో మాట్లాడిన నాగచైతన్య తన కామెంట్లతో అక్కడి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. తమిళ ప్రేక్షకులు తనను ఆదరించాలని అంగీకరించాలని చైతన్య కోరారు.కస్టడీ సినిమా తమిళంలో కూడా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ అవుతుండగా అక్కడ ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి. గత సినిమాలతో నిరాశపరిచిన నాగచైతన్య తర్వాత సినిమాలతో ప్రేక్షకులను ఏ స్థాయిలో మెప్పిస్తారో చూడాల్సి ఉంది.

నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటిస్తారని తెలుస్తోంది. నాగచైతన్య తర్వాత సినిమాలకు దర్శకుడు ఎవరనే ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది. చైతన్య కెరీర్ పరంగా మరింత ఎదగడంతో పాటు తండ్రిని మించిన కొడుకు కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అక్కినేని ఫ్యామిలీ నుంచి మరో మల్టీస్టారర్ రావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్కినేని హీరోలకు భారీ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అక్కినేని హీరోలకు సక్సెస్ రేట్ తగ్గుతున్నా ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతోంది. చైతన్య తన సినిమాల ప్రమోషన్లలో భాగంగా ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. సమంత గురించి చైతన్య పాజిటివ్ గా స్పందించడంతో చైతన్య, సమంత ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus