Naga Chaitanya: మహేష్ బాబుకు హిట్టిచ్చినా ఎదురుచూపులు తప్పవా?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోలలో ఒకరైన నాగచైతన్య నటించిన థాంక్యూ ఈ నెల 22వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. వరుస విజయాలు అందుకుంటున్న చైతన్య ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చైతన్య పరశురామ్ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మరింత ఆలస్యం కానుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

పరశురామ్ ని చైతన్య వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారని సమాచారం అందుతోంది. సర్కారు వారి పాట సినిమాతో సక్సెస్ సాధించినా పరశురామ్ ను చైతూ వెయిటింగ్ లిస్ట్ లో పెట్టడం గురించి ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చైతన్య వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఒక సినిమాలో యంగ్ డైరెక్టర్ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాతే చైతన్య పరుశురామ్ కాంబో మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

వాస్తవానికి గీతా గోవిందం తర్వాత చైతన్య పరశురామ్ కాంబోలో సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే మహేష్ బాబు సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం రావడంతో పరశురామ్ చైతన్యను ఒప్పించి సినిమాను వాయిదా వేశారు. ఇప్పుడు నాగచైతన్య సైతం పరశురామ్ విషయంలో ఇదే విధంగా వ్యవహరించారు. ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో చూడాల్సి ఉంది. భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.

తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ సాధించేలా నాగచైతన్య జాగ్రత్త పడుతున్నారు. ఒక్కో సినిమాకు 10 నుంచి 12 కోట్ల రూపాయల రేంజ్ లో నాగచైతన్య పారితోషికం తీసుకుంటున్నారు. మిడిల్ రేంజ్ హీరోలలో ఈ రేంజ్ పారితోషికం తీసుకుంటున్న అతికొద్ది మంది హీరోలలో చైతన్య ఒకరు కావడం గమనార్హం.

ఫస్ట్ హాఫ్ లో భారీ నుండి అతి భారీగా ప్లాప్ అయిన 15 సినిమాల లిస్ట్..!

Most Recommended Video

టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న 10 మంది హీరోయిన్స్ లిస్ట్..!
అభిమానులకు అవకాశాలు ఇచ్చి బ్లాక్ బస్టర్లు అందుకున్న హీరోలు..!
ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అయిన 13 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus