Naga Chaitanya: ఏ స్టార్ హీరో సాయం కోరని చైతన్య.. గ్రేట్ అంటూ?

  • May 11, 2023 / 07:12 PM IST

టాలీవుడ్ ప్రముఖ హీరోలలో ఒకరైన నాగచైతన్యకు ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉంది. థాంక్యూ, లాల్ సింగ్ ఛడ్డా సినిమాల ఫలితాలు నిరాశపరిచినా కంటెంట్ ప్రధానంగా తెరకెక్కిన కస్టడీ సినిమా చైతన్య కోరుకున్న భారీ విజయాన్ని అందిస్తుందని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు. అయితే కస్టడీ సినిమా ప్రమోషన్స్ కోసం నాగచైతన్య ఇతర స్టార్ హీరోల సహాయం కోరలేదు. సోలోగా ప్రమోషన్స్ చెయ్యడానికి చైతన్య ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయంలో నాగచైతన్య గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

నాగచైతన్య (Naga Chaitanya) కస్టడీ సినిమా ప్రమోషన్స్ కోసం పడుతున్న కష్టాన్ని చూసిన నెటిజన్లు ఈ సినిమాతో చైతన్య కోరుకున్న భారీ విజయం కచ్చితంగా దక్కాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కస్టడీ సినిమా కోసం చైతన్య నాగార్జున సపోర్ట్ కూడా తీసుకోవడం లేదనే సంగతి తెలిసిందే. కస్టడీ సినిమాకు 23 కోట్ల రూపాయలకు అటూఇటుగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సులువుగానే ఈ రేంజ్ లో కలెక్షన్లు వస్తాయి.

కస్టడీ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అక్కినేని హీరోలు కోరుకుంటున్న మెమరబుల్ హిట్ ఈ సినిమాతో దక్కాలని అభిమానులు అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. కస్టడీ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉంటాయో చూడాలి. ఈ సినిమాపై కృతిశెట్టి చాలా ఆశలు పెట్టుకున్నారు. వరుస ఫ్లాపుల తర్వాత కృతిశెట్టి నటించిన ఈ సినిమా ఆమెకు సక్సెస్ తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

నాగార్జున కెరీర్ లో శివ మూవీలా నాగచైతన్య కెరీర్ లో కస్టడీ నిలుస్తుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిందని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీ సక్సెస్ రేటు తగ్గుతుండగా కస్టడీ సినిమా ఆ లోటును తీరుస్తుందేమో చూడాల్సి ఉంది.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus