కరోనా వైరస్ మహమ్మారి కారణంగా సినీ పరిశ్రమ ఆర్ధికంగా చాలా నష్టపోయింది. ముఖ్యంగా ఎన్నో సినిమాలు థియేట్రికల్ రిలీజ్ కు నోచుకోలేక ఓటిటిల బాట పట్టాయి. అయితే ఎట్టకేలకు డిసెంబర్ 25న విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రంతో థియేటర్లు తెరుచుకున్నాయి. 50శాతం సీటింగ్ కెపాసిటీతో థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఆ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది. ఆ తరువాత విడుదలైన ‘క్రాక్’ ‘మాస్టర్’ ‘రెడ్’ ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ ‘జాంబీ రెడ్డి’ ‘ఉప్పెన’ ‘నాంది’ వంటి చిత్రాలు కూడా హిట్ అవ్వడంతో టాలీవుడ్ కలకలలాడుతుంది.
అంతా బాగానే ఉంది కానీ.. ఓవర్సీస్ మార్కెట్ మాత్రం కనీసం కోలుకోలేదు. సుకుమార్ బ్రాండ్ తో వచ్చిన ‘ఉప్పెన’ కూడా అక్కడ ఆడలేదు. ఇలా అయితే రాబోయే పెద్ద సినిమాలు అయిన ‘వకీల్ సాబ్’ ‘ఆచార్య’ ‘రాధే శ్యామ్’ ‘ఆర్.ఆర్.ఆర్’ ‘పుష్ప’ వంటి చిత్రాలకు పెద్ద దెబ్బ పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మార్కెట్ ను చక్కదిద్దాల్సిన పని ఇప్పుడు నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’ పై పడింది. దర్శకుడు శేఖర్ కమ్ముల చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి డిమాండ్ ఉంటుంది.
అతని సినిమాలు అక్కడ అసాధారమైన వసూళ్ళను రాబడుతుంటాయి. ఆయన తెరకెక్కించిన సినిమాలన్నీ అక్కడ సూపర్ హిట్లే..! ‘ఫిదా’ చిత్రమైతే అక్కడ 2 మిలియన్ డాలర్లను వసూల్ చేసి రికార్డు సృష్టించింది.పైగా ‘లవ్ స్టోరీ’ లో సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్ కూడా నటిస్తుంది కాబట్టి.. కచ్చితంగా ఓవర్సీస్లో కూడా ‘లవ్ స్టోరీ’ మంచి కలెక్షన్లను నమోదు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!