Naga Chaitanya: విడాకుల తర్వాత చైతన్య ఏంటి ఇంత అందంగా మారిపోయారు?

  • May 6, 2023 / 07:52 PM IST

అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చైతన్య కెరియర్ మొదట్లో ఆయన లుక్స్ పరంగా భారీ ట్రోల్స్ ఎదుర్కొన్నారు. నాగచైతన్య లుక్స్ ఏమాత్రం బాగాలేవని ఈయనది హీరో కటౌట్ కాదు అంటూ ఎన్నో విమర్శలు ఎదురయ్యాయి అయితే నాగచైతన్య సినిమా సినిమాకు తన లుక్స్ విషయంలో ఎన్నో మార్పులు చేసుకుంటున్నారు. అయితే తాజాగా చైతన్య లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా నాగార్జున ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.

అయితే అందం విషయంలో మన్మధుడికి పోటీ ఇస్తున్నారు నవమన్మధుడు నాగచైతన్య. ఒకప్పుడు పెద్దగా గ్లామర్ లుక్ లేకపోయినటువంటి నాగచైతన్య సమంతతో విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత అందం విషయంలో మాత్రం తండ్రికి పోటీ వస్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీ బిజీగా గడుపుతున్నారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేస్తూ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు.

వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు తమిళ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు అయితే ఈ ఇంటర్వ్యూలలో నాగచైతన్య చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారని చెప్పాలి.

ఇలా ఎంతో అందంగా తయారైనటువంటి (Naga Chaitanya) నాగచైతన్య లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకోవడమే కాకుండా అందం విషయంలో తండ్రికి మించిన అందగాడు అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు. థాంక్యూ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి నాగచైతన్యకు ఈ సినిమా పెద్దగా సక్సెస్ అందించలేకపోయింది. మరి కస్టడీ సినిమా అయినా తనని బయటపడేస్తుందా లేదా తెలియాల్సి ఉంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus