Naga Chaitanya: సముద్రం ఒకవైపు… సరదాలు మరోవైపు.. చైతు ప్లాన్ అదుర్స్‌!

నాగచైతన్యకు గత మూడు సినిమాలు ఏ మాత్రం కలసి రాలేదు. ఏ జోనర్‌లో సినిమా చేసినా.. తేడా కొట్టేస్తోంది. ఈ క్రమంలో పాన్‌ ఇండియా లెవల్‌లోనూ ఎంట్రీ ప్రయత్నం ఇచ్చినా.. అచ్చి రాలేదు. తమిళ – తెలుగు సినిమా అనుకుంటే అది కూడా ఇబ్బంది పెట్టేసింది. అందుకేనేమో చైతన్య ఇప్పుడు డబుల్‌ ప్లాన్‌ వేస్తున్నాడు. అవును, ఒకేసారి రెండు సినిమాలు, అందులోనూ డిఫరెంట్‌ జోనర్‌ సినిమాలు చేసి అభిమానులకు అందివ్వాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఓ ఆసక్తికరమైన పుకారు బయటకు వచ్చింది.

చందూ మొండేటితో ఓ సినిమాకు ఇటీవల పచ్చ జెండా ఊపిన (Naga Chaitanya) నాగచైతన్య ఇప్పుడు మరో కథకు దాదాపు ఓకే చెప్పారట. ఆ కథకి సంబంధించి ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయట. అన్నీ అనుకున్నట్లుగా జరిగి.. అంతా కుదిరితే ఈ కొత్త కలయికలో సినిమాకి రంగం సిద్ధమైనట్టే అని చెబుతున్నారు. ఇంతకీ ఈ కథ ఎవరిదో చెప్పలేదు కదా. ‘సామజవరగమన’ సినిమాతో ఇటీవల మంచి విజయం అందుకున్న రామ్‌ అబ్బరాజు. ఇటీవల చైనుకలసి రామ్‌ అబ్బరాజు బేసిక్‌ పాయింట్‌ వివరించారట.

ఈ సినిమాను పూర్తిగా ఓకే అయ్యి.. కథ సిద్ధమైతే… చందూ మొండేటి సినిమా, ఈ సినిమా సమాంతరంగా తెరకెక్కిస్తారట. కామెడీ, మాస్‌ అంశాలతో ‘సామజవరగమన’ సినిమాను తెరకెక్కించి మంచి విజయం అందుకున్నారు రామ్‌ అబ్బరాజు. ఇప్పుడు చైతన్యఉ చెప్పిన కథ కూడా ఇలాగే ఉంటుంది అని అంటున్నారు. ఈ సినిమాను ఏషియన్‌ సంస్థ సునీల్‌ నారంగ్‌ నిర్మిస్తారని సమాచారం. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చేస్తుందని చెబుతున్నారు.

ఒకవేళ ఇదే జరిగితే.. ఒకేసారి రెండు రకాల జోనర్లలో నాగచైతన్య సినిమా చేస్తున్నట్లు అవుతుంది. చందూ మొండేటి సినిమాలో చైతన్య గంగపుత్రుడుగా కనిపిస్తాడని సమాచారం. ఇప్పడు రామ్‌ అబ్బరాజు సినిమాలో ఫుల్‌ కామెడీ చేస్తాడు అంటున్నారు. కాబట్టి ఫ్యాన్స్‌కి డబుల్‌ బొనాంజానే అని చెప్పొచ్చు. మరి ఒకేసారి మొదలైనా.. ఏది ముందు రిలీజ్‌ చేస్తారు అనేది చూడాలి.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus