Naga Chaitanya: అలెర్ట్ అయిన నాగ చైతన్య టీం.. అదంతా అబద్దమట!

అక్కినేని నాగ చైతన్య… ఈ మధ్యనే ‘కస్టడీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమాపై నాగ చైతన్య చాలా హోప్స్ పెట్టుకున్నాడు. టాక్ బాగానే వచ్చినా.. ఎందుకో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో తాను చేయబోయే నెక్స్ట్ సినిమాలపై గట్టి ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో నాగ చైతన్య బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ఓ మూవీని రీమేక్ చేయబోతున్నాడు అంటూ కథనాలు మొదలయ్యాయి.

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘భూల్ భులయ్యా 2’ అక్కడ సూపర్ సక్సెస్ అందుకుంది. ఓ హిట్టు కోసం పరితపిస్తున్న బాలీవుడ్ కు ఈ మూవీ ఆ ముచ్చటను తీర్చింది. దీంతో నాగ చైతన్య .. ఆ సినిమా రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు చర్చ జరిగింది.వాస్తవానికి నాగ చైతన్య కూడా రీమేక్ లు చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించడు. అయినా ఈ వార్త చాలా స్పీడ్ గా వైరల్ అయిపోయింది.

దీంతో స్వయంగా నాగ చైతన్య (Naga Chaitanya) టీం రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ‘భూల్ భులయ్యా 2’ రీమేక్ లో నాగచైతన్య నటిస్తున్నారు అంటూ ప్రచారమవుతున్న వార్తల్లో నిజం లేదు.దయచేసి అలాంటి వార్తలను నమ్మొద్దు అంటూ టీం నాగ చైతన్య కోరారు. ఇక నెక్స్ట్ మూవీ చందూ మొండేటి దర్శకత్వంలో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. గతంలో వీరి కాంబినేషన్లో ‘ప్రేమమ్’ ‘సవ్య సాచి’ వంటి చిత్రాలు వచ్చాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus