విలేఖరి నుంచి ఎడిటర్ దాకా ఎదిగి నిర్మాతగా మారిన సురేష్ కొండేటి గత పదిహేనేళ్లుగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సంతోషం పేరిట అవార్డ్స్ అందిస్తున్నారు. ఈ సంవత్సరం గా కూడా ఈ వేడుక వైభవంగా నిర్వహించారు. ఈ నెల 12న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సంతోషం-సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డుల వేడుక సందడిగా సాగింది. ఉత్తమ నటుడిగా నాగచైతన్య (ప్రేమమ్), నటిగా సమంత (అఆ), దర్శకుడిగా బోయపాటి శ్రీను (సరైనోడు), నిర్మాతగా రాజ్ కందుకూరి (పెళ్లి చూపులు) అవార్డులు అందుకున్నారు.
స్వర్గీయ దాసరి నారాయణరావు పేరు మీద ఈ ఏడాది నుంచి దాసరి స్మారక అవార్డులనూ ‘సంతోషం’ సురేశ్ ఇవ్వడం ప్రారంభించారు. నిర్మాతగా అల్లు అరవింద్, నటుడిగా మురళీమోహన్, రచయితలుగా పరుచూరి సోదరులు, విలేకరిగా పసుపులేటి రామారావులు దాసరి స్మారక పురస్కారాన్ని అందుకున్నారు. అల్లు రామలింగయ్య స్మారక అవార్డును సప్తగిరి అందుకున్నారు. నటి రోజా రమణి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా నాగ చైతన్య మాట్లాడుతూ ‘‘ప్రేక్షకులు, విమర్శకుల ప్రోత్సాహంతో ‘ప్రేమమ్’కు అవార్డు వచ్చింది. అలాగే, సమంత ఇంటినిండా ఉన్న అవార్డుల్లో సంతోషం అవార్డు కూడా చేరింది’’ అని అన్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.