Naga Chaitanya: డౌట్ లేదు.. మంచి కథ మిస్ చేసుకున్న నాగ చైతన్య

సుహాస్ (Suhas)  హీరోగా ‘జనక అయితే గనక’ (Janaka Aithe Ganaka)  అనే సినిమా రూపొందింది. ‘దిల్ రాజు (Dil Raju)  ప్రొడక్షన్స్’ బ్యానర్లో హర్షిత్ రెడ్డి (Harshith Reddy), హన్షిత రెడ్డి (Hanshitha Reddy)..లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించినట్లు తెలుస్తుంది. టీజర్, ట్రైలర్స్.. చాలా ప్రామిసింగ్ గా ఉన్నాయి. మధ్య తరగతి కుటుంబానికి చెందిన హీరో.. పిల్లల్ని కని, పెంచడం భారం అని భావించి .. దాంపత్య జీవితంలో ఇబ్బందులు రాకుండా సేఫ్టీ వాడతాడు. అయినా సరే అతని భార్య గర్భం దాల్చడంతో.. సదరు కం*మ్ సంస్థపై కేసు వేస్తాడు.

Naga Chaitanya

ఆ తర్వాత జరిగే కోర్టు డ్రామా చాలా ఫన్నీగా ఉంటుందని తెలుస్తుంది. ట్రైలర్లో కూడా అదే హైలెట్ అనిపించింది. ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు సందీప్ బండ్ల సూపర్ టాలెంటెడ్ అని ఇండస్ట్రీ టాక్.కచ్చితంగా అతను స్టార్ డైరెక్టర్ అవుతాడు అని కూడా చాలా మంది చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. దర్శకుడు సందీప్ బండ్ల ‘జనక అయితే గనక’ చిత్రం కథని ముందుగా సుహాస్ కోసం డిజైన్ చేసుకోలేదట.

అక్కినేని నాగ చైతన్యకి (Naga Chaitanya) ముందుగా ఈ కథ చెప్పాడట. చైతన్యకి కూడా కథ బాగా నచ్చింది. సందీప్ కాన్ఫిడెన్స్ చూసి వెంటనే ఓకే చెప్పేసినట్టు కూడా సమాచారం. కానీ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుండి నాగ చైతన్య తప్పుకున్నాడట. దీంతో తర్వాత ఈ కథ సుహాస్ వద్దకి వెళ్లిందని తెలుస్తుంది.

సుహాస్ ఇమేజ్ కి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడట దర్శకుడు. వాస్తవానికి సెప్టెంబర్ 7నే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో వరదలు రావడంతో పోస్ట్ పోన్ చేసినట్టు వెల్లడించింది చిత్ర బృందం.

ఇంట్రెస్టింగ్‌ కాంబో.. నాని – సాయిపల్లవి.. దర్శకుడు ఆయనే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus