Nani, Sai Pallavi: ఇంట్రెస్టింగ్‌ కాంబో.. నాని – సాయిపల్లవి.. దర్శకుడు ఆయనే..!

కొన్ని కాంబినేషన్స్‌ ఉంటాయండీ.. వాటి గురించి ఎన్నేళ్లు వెయిట్‌ తప్పులేదు అనిపిస్తుంది. ఆ దర్శకుడి చేతిలో ఆ హీరో పడితే చాలు.. ఆటోమేటిగ్గా హిట్ పక్కా అనుకునే కాంబినేషన్‌ అది. ఆ హీరో – హీరోయిన్‌ కలిస్తే చాలు కెమిస్ట్రీ భలేగా ఉంటుంది అనుకునే కాంబినేషన్స్‌ ఇవీ. ఆ నాయిక – కెప్టెన్‌ కలిస్తే కేకో కేక అనే కాంబినేషన్‌ అది. ఒక్కోసారి అలాంటి మూడు కాంబినేషన్లు కలసి ట్రయో అయితే ఇంకెలా ఉంటుంది చెప్పండి.

Nani, Sai Pallavi

ఇప్పుడు అలాంటి ట్రయో సెట్‌ అవుతోంది మన టాలీవుడ్‌లో. అవును, మీరు విన్నది నిజమే. నాగచైతన్య  (Naga Chaitanya) – శేఖర్‌ కమ్ముల (Sekhar Kammula) – సాయిపల్లవి (Sai Pallavi) ఈ ముగ్గురూ కలసి ఓ సినిమా చేస్తారు అని తెలుగు సినిమా వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. ‘ఫిదా’ (Fidaa) , ‘లవ్‌స్టోరీ’ (Love Story) అంటూ శేఖర్‌ కమ్ముల – సాయిపల్లవి ఇప్పటికే రెండు సినిమాలు చేశారు. రెండూ మంచి సినిమాలే అనిపించుకున్నాయి. సాయిపల్లవిని మనకు దగ్గర చేశాయి.

ఇక నాని (Nani) – సాయిపల్లవి కలసి ‘ఎంసీఏ’, ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ (Shyam Singha Roy) అంటూ రెండుసార్లు వచ్చి అదరగొట్టారు. వాళ్ల కెమిస్ట్రీ, యాక్టింగ్‌ స్కిల్స్‌ సూపరో సూపరు. అలాంటి ఈ రెండు కాంబోలు కలసి ట్రయో అయితే.. ఆ ప్లానింగే ఇప్పుడు టాలీవుడ్‌లో జరుగుతోందట. అక్కినేని నాగ చైతన్యతో కలసి ‘తండేల్’ (Thandel) సినిమా చేస్తున్న సాయిపల్లవి ఆ తర్వాత తెలుగులో ఈ సినిమాను ఓకే చేసింది అంటున్నారు.

సెన్సిబుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల ఈసారి కూడా అలాంటి కథనే ఎంచుకున్నారట. మరి ఆ కథేంటి, ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు వస్తుంది అనే వివరాలు తెలియాల్సి ఉంది. నాని చేతిలో ఉన్న సినిమాల బట్టి చూస్తే ఇప్పట్లో కష్టమే. అలాగే శేఖర్‌ కమ్ముల కూడా రెండు సినిమాలు ఓకే చేసుకొని ఉన్నారు. ఇక సాయిపల్లవి అయితే హిందీ ‘రామాయణ’ చేస్తోంది. కాబట్టి ఇప్పట్లో ఈ ట్రయో కలవరు. పైన చెప్పాం కదా ఇలాంటి సినిమా కోసం ఎన్నేళ్లు ఆగినా ఫర్వాలేదని.. అదన్నమాట మేటర్‌.

హీరోయిన్ ఆవేదన.. దర్శకనిర్మాతలు మారతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus