Naga Chaitanya: నాగచైతన్య మాటల్లో ఇంత అర్థం ఉందా?

జోష్ సినిమాతో హీరోగా టాలీవుడ్ లో నాగచైతన్య కెరీర్ ను మొదలుపెట్టగా ఏ మాయ చేశావె సినిమాతో చైతన్య ఖాతాలో తొలి హిట్ చేరింది. ఆ తర్వాత చైతన్య నటించిన 100% లవ్, తడాఖా, ప్రేమమ్, వెంకీ మామ, లవ్ స్టోరీ, మనం, మజిలీ సినిమాలు సక్సెస్ సాధించాయి. థాంక్యూ సినిమాతో చైతన్య మరో సక్సెస్ సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వచ్చే ఏడాది ఫస్ట్ హాఫ్ లో థాంక్యూ మూవీ రిలీజ్ కానుంది. థాంక్యూ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైందని సమాచారం.

ప్రస్తుతం వెబ్ సిరీస్ షూటింగ్ తో బిజీగా ఉన్న నాగచైతన్య బంగార్రాజు సినిమాతో మరో సక్సెస్ సాధిస్తానని నమ్మకంతో ఉన్నారు. బంగార్రాజు విడుదలైన తర్వాత నాగచైతన్య తరువాత ప్రాజెక్ట్ లకు సంబంధించిన వివరాలను ప్రకటించే అవకాశం అయితే ఉంది. అయితే ఒక ఇంటర్వ్యూలో నాగచైతన్య చేసిన కొన్ని కామెంట్లు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. చైతన్య ఇప్పటివరకు చేసిన పాత్రలన్నీ అతనికి మంచిపేరు తెచ్చిపెట్టాయి. విమర్శలు తెచ్చిపెట్టే పాత్రలకు, వివాదాస్పద పాత్రలకు చైతన్య దూరంగా ఉన్నారు.

ఒక ఇంటర్వ్యూలో విభిన్నమైన పాత్రలలో నటించడం తనకు ఇష్టమే అని అన్ని తరహా పాత్రలను చేయడానికి తాను సిద్ధపడతానని చైతన్య అన్నారు. అయితే తను నటించిన సినిమాలు లేదా సినిమాలలోని పాత్రలు కుటుంబంపై ప్రభావం చూపకూడదని భావిస్తానని నాగచైతన్య చెప్పుకొచ్చారు. ఫ్యామిలీపై ఎఫెక్ట్ పడే పాత్రలు అయితే చేయనని వెంటనే చెప్పేస్తానని చైతన్య అన్నారు. సమంత గురించి ఇన్ డైరెక్ట్ గా చైతన్య ఈ కామెంట్లు చేసి ఉండవచ్చని కొంతమంది చెబుతున్నారు.

మరి చైతన్య సాధారణంగానే చెప్పారో లేక సమంతను ఉద్దేశించి చెప్పారో స్పష్టత లేదు. మరోవైపు లాల్ సింగ్ ఛద్దా సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న నాగచైతన్య ఆ సినిమాతో ఎలాంటి ఫలితం అందుకుంటారో చూడాల్సి ఉంది. వరుస ప్రాజెక్ట్ లతో నాగచైతన్య బిజీగా ఉంటూ కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. చైతన్య ఒక్కో సినిమాకు ఒక్కో విధంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus