అక్కినేని నాగ చైతన్య గతేడాది చివర్లో శోభిత ధూళిపాళని ప్రేమ వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రుల సమక్షంలో సింపుల్ గా చైతన్య, శోభిత..ల వివాహం జరిగింది. 2021 లో సమంతతో విడాకులు తీసుకున్న అనంతరం.. శోభిత, చైతన్య బాగా దగ్గరయ్యారు. వాళ్ళు డేటింగ్లో ఉన్నట్టు చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వాళ్ళు కలిసి ఒక్క సినిమాలో కూడా నటించకపోవడంతో ఆ ప్రచారంలో నిజం లేదేమో అని అంతా అనుకున్నారు. కానీ గత ఏడాది ఊహించని విధంగా వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ చేసి అందరికీ పెద్ద షాకిచ్చాడు నాగార్జున.
Naga Chaitanya, Sobhita
దీంతో ఆడియన్స్ లో చాలా డౌట్లు ఉన్నాయి. అసలు నాగ చైతన్య, శోభిత ఎలా కలుసుకున్నారు? ఎలా దగ్గరయ్యారు? వీరికి ఒకరి పట్ల మరొకరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? అనే విషయాలు తెలుసుకోవాలి అనే ఆసక్తి.. అభిమానులకు ఎక్కువగానే ఉంది. ఇటీవల జగపతి బాబు హోస్ట్ చేస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా’కి గెస్ట్ గా వచ్చాడు చైతన్య. ఈ షోలో నాగ చైతన్య మాట్లాడుతూ… “శోభితతో నా ప్రయాణం ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మొదలైంది.
నా భార్యను అలా కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఆమె సినిమాలు, వర్క్ నాకు బాగా తెలుసు. అయితే ఒకసారి నా క్లౌడ్ కిచెన్ గురించి పోస్ట్ పెట్టినప్పుడు, శోభిత ఒక ఎమోజీతో రెస్పాన్స్ ఇచ్చింది. అప్పటి నుండి ఆమెతో చాట్ చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత ఒకసారి కలుసుకున్నాం. శోభిత నా భార్య మాత్రమే కాదు… నాకు పెద్ద బలం కూడా.తన సపోర్ట్ నాకు మంచి ఎనర్జీ ఇస్తుంది. ఆమె లేకుండా నేను ఉండలేను అనే ఫీలింగ్ ఉంటుంది” అంటూ భార్య గురించి చాలా ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.