ఫోటో లీక్ అయినా.. చైతూ లుక్ అదిరింది..!

2019 లో ‘మజిలీ’ ‘వెంకీ మామ’ చిత్రాలతో సూపర్ హిట్లు అందుకున్నాడు అక్కినేని నాగచైతన్య. ఇప్పుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్లో చేస్తున్న ‘లవ్ స్టోరీ’ తో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగిల్ కు మంచి రెస్పాన్స్ లభించింది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇక ఈ చిత్రం తరువాత నాగ చైతన్య చెయ్యబోతున్న చిత్రం ‘థాంక్యూ’. అక్కినేని ఫ్యామిలీకి ‘మనం’ వంటి క్లాసిక్ ను అందించిన విక్రమ్.కె.కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇదిలా ఉండగా.. ఈ చిత్రం షూటింగ్ స్పాట్ పిక్ ఒకటి లీక్ అయ్యింది. ఈ పిక్ లో నాగ చైతన్య హాకీ బ్యాట్ పట్టుకుని స్పోర్ట్స్ డ్రెస్ లో కనిపిస్తున్నాడు. ‘థాంక్యూ’ సినిమా హాకీ నేపథ్యంలో సాగుతుందని ముందు నుండీ రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ లీక్డ్ పిక్ తో అది నిజమే అని స్పష్టమవుతుంది. అంతేకాదు చైతన్య ధరించిన స్పోర్ట్స్ డ్రెస్ ను గమనిస్తే… షర్ట్ వెనుక అభి అనే పేరు కనిపిస్తుంది.

దానిని బట్టి ఈ చిత్రంలో అతని పేరు కూడా అదే అయ్యి ఉంటుంది అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఇక దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన గత చిత్రం ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. పైగా విక్రమ్ కుమార్ సినిమాలో ఉండే సర్ప్రైజ్ లు కూడా మిస్ అయ్యాయి అనే కామెంట్లు వినిపించాయి. దాంతో ‘థాంక్యూ’ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట విక్రమ్ కుమార్. మరి ఈ సినిమాతో అయినా హిట్టు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి..!

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus