Naga Chaitanya, Samantha: సమంత తో విడాకులు.. నాగ చైతన్య అసహనం..!

నాగచైతన్య, సమంత లు గతేడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడిపోయిన తర్వాత ఎవరి దారి వారు చూసుకుని సినిమాల్లో బిజీగా గడుపుతున్నారు. అయితే వాళ్ళిద్దరూ ఏ షోలో హాజరైనా విడాకుల గురించి ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది. సోషల్ మీడియాలో అయితే వీళ్ళు తప్పించుకుంటున్నారు కానీ ఏదైనా షో వంటి వాటిలో పాల్గొన్నప్పుడు అయితే కచ్చితంగా ఈ విషయం పై ఏదో ఒక ప్రశ్న ఎదురవుతూనే ఉంది.

సమంత పరోక్షంగా ఏంటేంటో చెబుతుంది కానీ.. నాగ చైతన్య మాత్రం ఈ విషయాన్ని చాలా సున్నితంగా హ్యాండిల్ చేస్తూ వచ్చాడు. కాకపోతే ఈసారి మాత్రం అతను సహనం కోల్పోయినట్టు కనిపిస్తుంది. ‘లాల్‌ సింగ్‌ చద్దా’ మూవీ ప్రమోషన్లో భాగంగా ఓ ఇంగ్లిష్‌ చానల్‌తో నాగ చైతన్య ముచ్చటించాడు. ఈ మూవీ గురించి, ఆమిర్ ఖాన్ గురించి, అలాగే ఇందులో తన బాలరాజు పాత్ర గురించి బోలెడన్ని ఇంట్రెస్టింగ్  విషయాలు చెప్పుకొచ్చిన చైతన్య ఆ తర్వాత విడాకులు ప్రశ్న ఎదురవగానే కొంచెం ఘాటు కామెంట్లు చేశాడు.

చైతన్య మాట్లాడుతూ.. “నా పర్సనల్ లైఫ్ గురించి అందరూ మాట్లాడుకోవడం నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికీ పర్సనల్‌ లైఫ్‌ ఉంటుంది అనే విషయాన్ని చాలా మంది మర్చిపోతున్నారు. సమంతతో విడాకులపై ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి కారణమేంటనేది ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు.

ప్రస్తుతం ఎవరి లైఫ్ వాళ్ళు జీవిస్తున్నారు. సమంత దారి సమంతదే.. నా దారి నాదే. ఇంతకంటే ఇక చెప్పాల్సిందేమీ లేదు’ అంటూ ఘాటుగా జవాబిచ్చాడు. అటు తర్వాత ‘నా పర్సనల్ లైఫ్ గురించి వస్తున్న రూమర్స్‌ని నేనెప్పుడూ పట్టించుకోను, మొదట్లో ఆలోచించేవాడిని కానీ ఇప్పుడు ఆలోచించడం లేదు’.. అంటూ చైతన్య చెప్పుకొచ్చాడు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus