అక్కినేని నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన కూడా తన సొంత కష్టం & ప్రయత్నాలతో తన కెరీర్ ను ముందుకు తీసుకువెళ్తున్న నటుడు అక్కినేని నాగ చైతన్య. ఈ హీరో తన తండ్రి లాగే మొదటి నుంచి ఎక్కువగా కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ ఉంటాడు. అక్కినేని హీరోలకు బాగా నప్పిన లవ్ జానర్ కధాంశాలలో చైతన్య తన రెండో చిత్రం ‘ఏమాయచేసావే’ తో ప్రేక్షకులను తన పెర్ఫార్మన్స్ తో మెస్మరైజ్ చేసాడు అప్పట్లో. అయితే తొలిసారిగా తన కెరీర్లో పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడు చైతూ.
‘విరూపాక్ష’ దర్శకుడు కార్తీక్ దండు డైరెక్షన్ లో నాగ చైతన్య హీరోగా, మీనాక్షి చౌదరి హీరోయిన్ గా ‘వృషకర్మ’ మూవీని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఒక వీడియోలో హీరో ఛైతన్య ఈ సినిమా కొరకు విపరీతంగా కష్టపడుతున్నట్లు కనపడుతుంది. అయితే ఈ పాన్ ఇండియా సినిమా తరువాత చైతన్య చేయబోయే మూవీ పై ఒక వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే..

బెదురులంక సినిమాతో మెగాఫోన్ పట్టుకొని తోలి చిత్రం తోనే హిట్ కొట్టిన దర్శకుడు క్లాక్స్. ఈ దర్శకుడు చైతన్య కి ఒక కథ వినిపించినట్టు, దానికి హీరో ఇంప్రెస్స్ అయ్యి ప్రాజెక్ట్ ఓకే చేసినట్టు సినీ వర్గాల నుంచి సమాచారం. నాగ చైతన్యతో ఇదివరకే సినిమాను నిర్మించిన ఒక ప్రముఖ సంస్థ ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతోందని వినికిడి.
