Naga Chaitanya: మరో టాలెంటెడ్ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చైతూ..!

2022 కి మొదటి బ్లాక్ బస్టర్ ను అందించింది ‘డీజే టిల్లు’ చిత్రం.ఫిబ్రవరి వంటి అన్ సీజన్లో అది కూడా రవితేజ వంటి పెద్ద హీరో నటించిన ‘ఖిలాడి’ కి పోటీగా రిలీజ్ అయ్యి కూడా బ్లాక్ బస్టర్ కొట్టింది ‘డీజే టిల్లు’.మినిమమ్ బజ్ తో రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతలైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారికి మంచి లాభాల్ని అందించింది. హీరో సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ చేసిన కామెడీ, నేహా శెట్టి గ్లామర్, శ్రీచరణ్ పాకాల-రామ్ మిరియాల సంగీతం కలగలిపి ఈ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ ను చేసాయి.

దర్శకుడు విమల్ కృష్ణ టేకింగ్ ను కూడా ప్రత్యేకంగా అభినందించాలి. విమ‌ల్ టాలెంట్ ను గుర్తించి ఎంతో మంది హీరోలు, నిర్మాతలు అతనితో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే క్రమంలోనాగ‌చైత‌న్య‌కి ఓ క‌థ వినిపించాడు విమల్. అది అతనికి బాగా న‌చ్చింది. స్క్రిప్ట్ కనుక ఫైనల్ అయితే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. కాకపోతే నాగ చైతన్య ఇప్పుడు చాలా బిజీ. ‘థాంక్యూ’ ప్రమోషన్లలో పాల్గొనాలి.

తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఓ బై లింగ్యువల్ మూవీ చేస్తున్నాడు. అలాగే ‘సర్కారు వారి పాట’ దర్శకుడు ప‌ర‌శురామ్ తో కూడా ఓ సినిమా మొదలుపెడతాడు. బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కథకి కూడా చైతూ ఓకె చెప్పినట్టు వినికిడి. అన్ని సినిమాల మధ్యలో విమల్ కృష్ణ తో సినిమా ఎలా చేస్తాడు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

అయితే ఒకేసారి 3 సినిమాల్లో నటించడం చైతూకి కొత్తేమి కాదు. బొమ్మరిల్లు భాస్కర్.. అఖిల్ తో కూడా ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు కాబట్టి.. విమల్ కు స్పేస్ దొరికే అవకాశం ఉంది.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus