Naga Chaitanya: ‘కస్టడీ’లో ఒక్క పాట కోసం ఏడు సెట్లు!

అక్కినేని నాగచైతన్య.. చాలా కాలంగా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని మాస్ అండ్ యాక్షన్ సినిమాలు చేశారు. కానీ అవేవీ కూడా వర్కవుట్ కాలేదు. మాస్ ఇమేజ్ కోసం చైతు ప్రయత్నించిన ప్రతీసారి ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ప్రేమ కథలతోనే చైతు భారీ విజయాలను అందుకున్నారు. రొమాంటిక్ అండ్ లవ్ జోనర్స్ చైతుకి బాగా కలిసొస్తాయి. చైతు చివరిగా ‘థాంక్యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు.

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయింది. కనీసపు కలెక్షన్స్ ను కూడా రాబట్టలేకపోయింది. సరైన ఓపెనింగ్స్ కూడా రాకపోవడంతో బయ్యర్లు బాగా నష్టపోయారు. నిజానికి ఈ సినిమా తరువాత దర్శకుడు పరశురామ్ తో సినిమా చేయాల్సివుంది. కానీ దాన్ని పక్కన పెట్టి తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి సినిమా చేస్తున్నారు చైతు. వీరి కాంబినేషన్ లో వస్తోన్న ‘కస్టడీ’ సినిమా కోసం నిర్మాత బాగా ఖర్చు చేస్తున్నట్లు సమాచారం.

మొదటి నుంచి కూడా ఈ సినిమా బడ్జెట్ అనుకున్నదానికంటే ఎక్కువే అవుతోంది. తాజాగా అన్నపూర్ణ స్టూడియోలో కేవలం ఒక్క పాట కోసం మొత్తం ఏడు సెట్లు వేసినట్లుగా సమాచారం. పెద్ద హీరోల సినిమాలకు సైతం రెండు, మూడు సెట్లు మాత్రమే వేస్తుంటారు. కానీ చైతు లాంటి మిడ్ రేంజ్ హీరోకి ఏడు సెట్లు అంటే ఎక్కువనే చెప్పాలి. చైతు చేసిన మాస్ సినిమాల రిజల్ట్,

అతడి చివరి సినిమా ‘థాంక్యూ’ పరిస్థితి చూసి కూడా ఇంత భారీ బడ్జెట్ పెడుతుండడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అయితే నిర్మాతకు మాత్రం ఈ సినిమాపై నమ్మకం ఉందని.. అందుకే దర్శకుడు ఏం అడిగినా.. నో చెప్పడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాతోనైనా.. చైతుకి మాస్ ఇమేజ్ వస్తుందేమో చూడాలి!

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus