Custody Trailer: నాగచైతన్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ.. కానీ?

నాగచైతన్య, కృతిశెట్టి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందనే సంగతి తెలిసిందే. ఇదే కాంబినేషన్ లో వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కిన కస్టడీ మూవీ ట్రైలర్ తాజాగా విడుదలైంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ యూత్ కు నచ్చేలా ఉంది. సాధారణ సినిమాల ట్రైలర్లకు భిన్నంగా కస్టడీ ట్రైలర్ ఉండగా ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

శివ అనే పోలీస్ ఆఫీసర్ రోల్ లో చైతన్య నటించగా కృతిశెట్టి ట్రెడిషనల్ లుక్ లో కనిపించి ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్న అరవింద స్వామి కొత్త తరహా లుక్ లో ఆకట్టుకున్నారు. ట్రైలర్ లో అరవిందస్వామి పర్ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది. ధృవ సినిమా తర్వాత అరవిందస్వామికి ఆ స్థాయి హిట్ దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొన్ని డైలాగ్స్ ట్రైలర్ కు హైలెట్ గా నిలిచాయి.

కథ రొటీన్ గానే ఉన్నా కథనం కొత్తగా ఉంటుందనే అభిప్రాయం ఈ ట్రైలర్ చూసిన ప్రేక్షకులు ఫీలవుతున్నారు. “ఒకసారి న్యాయం పక్కన నిలబడి చూడు.. నీ లైఫే మారిపోతుంది”, “నిజం గెలవడానికి లేటవుతుంది కానీ కచ్చితంగా గెలుస్తుంది” అనే డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మానాడు సినిమాతో సక్సెస్ సాధించిన వెంకట్ ప్రభు ఈ సినిమాతో అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తానని భావిస్తున్నారు.

యూట్యూబ్ లో (Custody) ఈ మూవీ ట్రైలర్ కు రికార్డ్ స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. కృతిశెట్టి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవతి అనే పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య లుక్ కొత్తగా ఉంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేసే రేంజ్ లో హిట్ అవుతుందో లేదో చూడాల్సి ఉంది. ఈ సినిమాతో సక్సెస్ సాధించడం చైతన్యకు కూడా అవసరమని చెప్పవచ్చు.

రామబాణం సినిమా రివ్యూ & రేటింగ్!
ఉగ్రం సినిమా రివ్యూ & రేటింగ్!

గుడి కట్టేంత అభిమానం.. ఏ హీరోయిన్స్ కు గుడి కట్టారో తెలుసా?
ఇంగ్లీష్ లో మాట్లాడటమే తప్పా..మరి ఇంత దారుణంగా ట్రోల్స్ చేస్తారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus