Bigg Boss 8 Telugu: సోనియాకి మణికంఠ కిస్..హాట్ టాపిక్ అయిన వీడియో.!
- September 17, 2024 / 01:13 PM ISTByFilmy Focus
‘బిగ్ బాస్ 8’ (Bigg Boss 8 Telugu) లో ఓ కామన్ మెన్ గా ఎంట్రీ ఇచ్చాడు నాగ మణికంఠ (Naga Manikanta) . 10వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అతను ‘బిగ్ బాస్’ హౌస్లో ఓ ‘అపరిచితుడు’..లా వ్యవహరిస్తున్నాడు అని చెప్పాలి. హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదట్లో.. అదీ నామినేషన్స్ రోజున విపరీతంగా ఏడ్చేసి.. బిగ్ బాస్ కూడా ఎమోషనల్ అయ్యేలా చేసేశాడు. సింపతీ కోసమానుకోవాలో ఏమో కానీ తన జీవితంలో పడ్డ కష్టాల గురించి.. తల్లిని పోగొట్టుకున్న విధానం గురించి చెప్పి అందరితోనూ కన్నీళ్లు పెట్టించేశాడు.
Bigg Boss 8 Telugu

ఇలాంటి వ్యక్తి హౌస్లో ఎక్కువ రోజులు ఉంటాడు అని అనుకోవడం కష్టం.మొదటి వారమే ‘ఇతను ఎలిమినేట్ అయిపోతాడు’ అని అంతా భావించారు. కానీ 3వ వారంలో కూడా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉండగా.. హౌస్లో ఉంటున్న తోటి కంటెస్టెంట్స్ తో కూడా అతని వైఖరి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఒక్కోసారి ఎమోషనల్ గా వాళ్ళతో మాట్లాడతాడు. ఇంకోసారి యష్మీ (Yashmi Gowda) వంటి అమ్మాయితో ఆయిల్ మసాజ్ చేయించుకుంటాడు. మరోపక్క అభయ్ (Abhay Naveen) వంటి కంటెస్టెంట్ ఏమైనా కామెంట్ చేస్తే సీరియస్ అయిపోతాడు.
ఇలా అతనిలో చాలా షేడ్స్ కనిపిస్తున్నాయి.ఏదేమైనా మొదటి వారంతో పోలిస్తే అతను కొంచెం స్ట్రాంగ్ అయినట్టే కనిపిస్తున్నాడు. ఈ మధ్య ‘గేమ్’ కొంచెం యాక్టివ్ గా ఆడుతున్నాడు. టాస్కుల విషయంలో కూడా శ్రద్ధ పెడుతున్నాడు. అలాగే తోటి హౌస్మేట్స్ తో చనువుగా వ్యవహరిస్తున్నాడు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో అతను..

మరో కంటెస్టెంట్ అయిన సోనియా పాట పాడుతున్న టైంలో వెళ్లి గట్టిగా పట్టుకుని కిస్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇది చూసిన కొంతమంది నెటిజన్లు .. ‘అరేయ్ మణికంఠ బాగా మారిపోయావురా’ ‘ఆ సోనియాతో పెట్టుకోకు బాగా డేంజర్’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Eh donga.. #Manikanta#BiggBossTelugu8 #SoniyaAkula #Prithviraj pic.twitter.com/8O0MHMjZtf
— TeluguBigg (@TeluguBigg) September 16, 2024
సోనియాని బుక్ చేసిన యష్మీ.. నామినేషన్స్ టాస్క్ లో ఏమైందంటే?











