‘బిగ్ బాస్ 8’ రసవత్తరంగా మారింది. నామినేషన్స్ ప్రక్రియ ఇలా మొదలైందో..లేదో..అందరూ అప్పటివరకు ధరించిన మాస్క్..లను తీసేయడం స్టార్ట్ చేశారు. నిన్నటి నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా అభయ్ నవీన్.. ‘నాగ మణికంఠని (Naga Manikanta) నామినేట్ చేశాడు. అందరికీ కష్టాలు ఉంటాయి. అవన్నీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పని లేదు. హౌస్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా గేమ్ ఆడాలి అనే లక్షణం ఉన్నవాళ్లే ఇక్కడ ఉండాలి. నీలో ఆ లక్షణం కనిపించడం లేదు మణికంఠ’ అంటూ తన కారణం చెప్పుకొచ్చాడు.
దీంతో నాగ మణికంఠ (Naga Manikanta) ..’నేను అన్ ఫిట్ అయితే ఈ వారమే బయటకి వెళ్ళిపోతాను’ అంటూ ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రేరణ కూడా నాగ మణికంఠని నామినేట్ చేస్తున్నట్టు చెప్పింది. దాంతో ‘అందరూ నామీద పడ్డారేంటి. నేను 7 వ తరగతి నుండి ఎన్నో కష్టాలు పడ్డాను. కన్న తండ్రిని పోగొట్టుకున్నాను. సవతి తండ్రి వల్ల ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. మా అమ్మ చనిపోతే దహన సంస్కారాల కోసం డబ్బులు అడుక్కున్నాను.
నా కూతురు దూరమైంది. ఆ టైంలో చచ్చిపోదాం అనుకున్నాను. కానీ అదే టైంలో బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది’ అంటూ సింపతీ వలకబోశాడు. ఆ తర్వాత పృథ్వీరాజ్, శేఖర్ భాష కూడా నాగ మణికంఠని నామినేట్ చేయడం జరిగింది. కేవలం ‘సింపతీ కార్డు వాడి హౌస్ లో కొనసాగాలని అనుకుంటున్నావు’ అంటూ వాళ్ళు అతన్ని నామినేట్ చేయడం జరిగింది. అలా ఫైనల్ గా నాగ మణికంఠ ఈ వారం నామినేషన్స్ లో నిలిచాడు.
తర్వాత రూమ్ కి వెళ్లి బెడ్ పై కూర్చొని ఏడవడం మొదలు పెట్టిన మణికంఠ.. కాసేపటికి విగ్గు తీసేసి మరింత భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ క్రమంలో అతన్ని బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్లోకి పిలవగా.. ‘నాకు నా భార్య కావాలి, నా కూతురు కావాలి, మా అత్త మామల దగ్గర గౌరవం కావాలి’ అంటూ మరింత ఏడవడం మొదలుపెట్టాడు. దీంతో బిగ్ బాస్ ‘ధైర్యం కోల్పోకు’ అంటూ చెప్పి పంపించేశాడు.