కొన్ని సినిమాలు థియేటర్లలో ఎప్పటికి వస్తాయి అని అభిమానులు ఎదురుచూస్తుంటారు. కొన్ని సినిమాల గురించి అస్సలు పట్టించుకోరు. థియేటర్లలో చూడలేదు.. ఇక్కడ చూడటం ఎందుకు అనేది వారి ఆలోచన అవ్వొచ్చు. అలాంటి సినిమాల్లో ఒకటి ఇప్పుడు ఓటీటీలో వచ్చేసింది. అదే ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart) . రామ్ పోతినేని (Ram) – పూరి జగన్నాథ్ (Puri Jagannadh) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను ఓటీటీలోకి డైరెక్ట్‌గా, సౌండ్ లేకుండా తీసుకొచ్చేశారు.
మాస్ ఆడియన్స్‌ను థియేటర్లలో మెప్పించిన ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar) సినిమాకు సీక్వెల్‌గా ‘డబుల్ ఇస్మార్ట్’ (Double Ismart OTT) సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. థియేటర్లలో ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమాను సైలెంట్‌గా అమెజాన్ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్‌కి తీసుకొచ్చింది. ఇక్కడ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను వీక్షించొచ్చు. థియేటర్లలోనే ఇబ్బందికర ఫలితం అందుకున్న ఈ సినిమా ఇక ఓటీటీలో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటుందో చూడాలి.
సినిమా కథ సంగతి చూస్తే.. చీకటి సామ్రాజ్యాధినేత బిగ్ బుల్ (సంజయ్ దత్) (Sanjay Dutt) విదేశాల్లో విలాసంగా జీవిస్తూ ఉంటాడు. భారతదేశాన్ని ముక్కలు చేయాలనేది అతని కల. దీంతో అతని కోసం ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘రా’ పట్టుకోవాలని వెతుకుతూ ఉంటుంది. అయితే బిగ్‌బుల్ మెదడులో కణితి ఉందని, దాని ప్రభావంతో కొన్ని నెలలే బతికే అవకాశం ఉందని వైద్యులు చెబుతారు. దీంతో ఎలాగైనా బతకాలనుకుంటాడు బిగ్ బుల్.
దాని కోసం వెతుకుతుండగా.. మెదడులో చిప్ పెట్టుకుని హైదరాబాద్‌లో ఉన్న ఇస్మార్ట్ శంకర్ (రామ్) గురించి తెలు్తుంది. బిగ్ బుల్ మెమొరీస్ కాపీ చేసి, ఇస్మార్ట్ శంకర్ మెదడులోని చిప్‌లో లోడ్ చేస్తారు. దాంతో శరీరం ఇస్మార్ట్ శంకర్‌ది అయినా, ఆలోచనలలు బిగ్ బుల్‌వే అవుతాయి. అలా అతనికి మరణం ఉండదనేది బిగ్ బుల్ టీమ్ ప్లాన్. ఇస్మార్ట్ శంకర్‌లోకి బిగ్ బుల్ ఆలోచనలు వచ్చాక ఏం జరిగింది? అనేదే సినిమా (Double Ismart OTT) కథ. ఈ కాన్సెప్ట్‌కు ఓటీటీ ప్రేక్షకులు ఏమన్నా ఆసక్తి చూపిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది.