Naga Shaurya: వావ్‌ బాడీ వెనుక కష్టాలు చెప్పిన శౌర్య!

సినిమా వాళ్లకేముంది బాడీ ఇలా పెంచాలి అనుకుంటే… అలా పెంచేస్తారు. వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు, సౌలభ్యాలు ఉంటాయి అంటారు. అయితే అనుకున్నంత సులభమే కాదు. నోరు కట్టుకొని, ఒంటిని కష్టబెడితే కానీ… అనుకున్నట్లుగా బెస్ట్‌ బాడీ రాదు. అయితే ప్రయోగాలు, కష్టాలు అంటే మేమున్నాం అంటూ ముందుకొచ్చే హీరోలు మన దగ్గర చాలామంది ఉన్నారు. అలా తాజాగా ఎయిట్‌ ప్యాక్‌ చేసి వావ్‌ అనిపించిన కుర్ర హీరో నాగశౌర్య. దాని కోసం ఎంత కష్టపడ్డాడో ఇటీవల చెప్పాడు.

‘లక్ష్య’ సినిమా కోసం నాగశౌర్య చాలా కష్టపడ్డాడు. టీజర్‌, ట్రైలర్‌లో ఆ విషయం పక్కాగా తెలిసిపోతుంది. సినిమా ఈ రోజే వస్తోంది కాబట్టి… మిగిలిన విషయాలు కూడా తెలిసిపోతాయి. ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో ఉంటుంది. ఏ ఆటైనా సరే ప్రొఫెషనల్‌గా వెళ్లాలంటే చాలా కష్టమే. అందుకే ఈ సినిమా కోసం శౌర్య విలువిద్యలో శిక్షణ తీసుకున్నాడు. ఆర్చరీ అంటే కష్టమేముంది అనుకుంటారు కానీ, 35 కేజీల బరువును వెనక్కి లాగడం మామూలు విషయం కాదు అని అన్నాడు శౌర్య.

సినిమాలో హీరో కీలక సమయంలో మారుతాడు. ఆ విషయాన్ని వివరంగా చూపించడానికే శరీరాకృతిలో మార్పులు చూపించారట. దీని కోసం శౌర్య ఎయిట్‌ ప్యాక్‌ చేశాడు. శరీరంలో నీరు తక్కువగా ఉన్నప్పుడే కండరాలు స్పష్టంగా కనిపిస్తాయి. అందుకే ఎయిట్‌ ప్యాక్‌ లుక్‌తో కనిపించే సన్నివేశాల కోసం దాదాపు తొమ్మిది రోజులపాటు నీళ్లు ముట్టుకోలేదట శౌర్య. మరి ఆ కష్టం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!</strong

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus