Naga Shaurya, Darshan: దర్శన్ కి మద్దతు తెలుపుతూ లెటర్ రిలీజ్ చేసిన నాగ శౌర్య

అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ (Darshan) ప్రధాన నిందితుడు అని తేలడంతో ప్రస్తుతం అతను జైల్లో ఉన్నాడు. తన ప్రియురాలి పై నెగిటివ్ కామెంట్స్ చేసినందుకు తన అనుచరులతో దారుణంగా కొట్టి చంపించాడు దర్శన్ అంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాను కూడా రేణుకా స్వామిని రెండు దెబ్బలు కొట్టినట్టు దర్శన్ కూడా ఒప్పుకున్నాడు. సో నిజం బయటపడే వరకు దర్శన్ ని నిందితుడిగానే భావిస్తారంతా.

అయితే ఇలాంటి టైంలో టాలీవుడ్ హీరో నాగ శౌర్య(Naga Shaurya) … దర్శన్ ని వెనకేసుకొస్తూ ఓ లెటర్ ని రిలీజ్ చేశాడు. అందులో దర్శన్ తో దిగిన ఓ ఫోటోని కూడా షేర్ చేశాడు. నాగ శౌర్య ఓ లెటర్ ద్వారా దర్శన్ పై స్పందిస్తూ ‘‘ ముందుగా రేణుకా స్వామి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అయితే ఈ కేసులో అప్పుడే అందరూ ఓ అభిప్రాయానికి వచ్చేయడం నాకు నచ్చడం లేదు. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు.. దర్శన్ అన్న ఎవరికీ ఎలాంటి హానీ తలపెట్టే రకం కాదు.

కలలో కూడా ఆయన ఎవరికీ హాని తలపెట్టడు. ఎవరైనా సాయం అంటే ముందుండే వ్యక్తి అతను. దర్శన్‌ అన్న పర్సనల్ గా తెలిసిన వారందరికీ ఈ విషయం బాగా తెలుసు. ఆయన వల్ల కష్టకాలంలో సాయం పొందిన వారు చాలా మంది ఉన్నారు. అందుకే దర్శన్‌ అన్నపై వస్తోన్న వార్తల్ని నేను నమ్మలేకపోతున్నాను. నాకు న్యాయ వ్యవస్థ పై పూర్తి నమ్మకం ఉంది. త్వరలోనే నిజం బయట పడుతుంది అని బలంగా నమ్ముతున్నాను.

ఈ కేసు వల్ల దర్శన్ ఫ్యామిలీ కూడా చాలా మాటలు పడుతుంది. చేయని తప్పుకు వాళ్ళని మాటలు అనడం ఏంటి? కాబట్టి ఆ కుటుంబ సభ్యుల ఆవేదనను కూడా అర్థం చేసుకోవాలి. మీపై నాకు నమ్మకముంది దర్శన్ అన్న. మీరు నిర్దోషి అని తేలే సమయం వస్తుంది. అసలు నేరస్థుడు ఎవరనేది కూడా బయట పడుతుంది” అంటూ పేర్కొన్నాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus