అశ్వథామ ఆడియో వేడుకలో హైలెట్ గా నాగ శౌర్య స్పీచ్!

  • January 26, 2020 / 10:06 AM IST

యంగ్ హారో నాగ శౌర్య నటించిన లేటెస్ట్ మూవీ అశ్వథామ విడుదల సిద్ధమైంది. ఈనెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. దీనితో నిన్న ఖమ్మం వేదికగా ఈ చిత్ర ఆడియో అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో నాగ శౌర్య స్పీచ్ హైలెట్ గా నిలిచింది. అశ్వథామ మూవీ గురించి, చిత్ర యూనిట్ గురించి, తన తల్లిదండ్రులతో పాటు అశ్వథామ చిత్రాన్ని రూపొందించడానికి సహకరించిన ప్రతి ఒక్కరి గురించి ఆయన మాట్లాడిన తీరు ఆసక్తికరంగా సాగింది. హీరోగా తన కెరీర్ లో ఎదుర్కొన్న జయాపజయాలను ఉన్నవి ఉన్నట్లు కుండబద్దలు కొట్టిన విధానం కట్టిపడేసింది.

ఇక సమాజంలో మన చుట్టూ ఉన్న ఆడవారికి జరుగుతున్న అన్యాయాలపై స్పందించే యువకుడిగా తన పాత్ర మరియు ఈ సినిమా తీరు ఉంటుందని చెప్పుకొచ్చారు. ఒక సామాజిక బాధ్యతతో ఈ సినిమా తెరకెక్కించానన్న నాగ శౌర్య, చిత్ర విజయం పై గట్టి నమ్మకం వ్యక్తం చేశారు. ఇక హీరోయిన్ మెహ్రిన్ ని పొగడ్తలతో ముంచెత్తిన నాగ శౌర్య తన పేరెంట్స్ తన పట్ల చూపించిన కేర్, తనపై చేసిన ఖర్చులు వంటి విషయాలు ఎమోషనల్ గా చెప్పుకొచ్చారు. అశ్వథామ నా కెరీర్ లో ఓ మంచి చిత్రం అవుతుంది అందుకే, టైటిల్ టాటూ వేయించుకున్నాను…అని చొక్కా విప్పి టాటూ చూపించడం కార్యక్రమంలో హైలెట్ గా నిలిచింది. నాగ శౌర్య సొంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి రమణ తేజ దర్శకత్వం వహించారు.


డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus