Naga Shaurya: నాగ శౌర్య అస్వస్థకు గురవడానికి గల కారణాలేంటంటే..?

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య అస్వస్థతకు గురయ్యారు.. ప్రస్తుతం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో ఆయన ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.. కొత్త సినిమా షూటింగులో పాల్గొంటున్న శౌర్య, ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే యూనిట్ సిబ్బంది అతణ్ణి ఆసుపత్రికి తరలించారు.అయితే తను అస్వస్థతకు గురవడానికి అతిగా ఆరోగ్యంపై ప్రభావం చూపేలా తీసుకున్న డైటే కారణమని తెలుస్తోంది.. కొత్త సినిమా షూటింగ్‌లో ఓ ఫైట్ సీన్ కోసం గత మూడు రోజులుగా వాటర్ తాగడం లేదట.

దీంతో స్పాట్‌లోనే సడెన్‌గా డీహైడ్రేటెడ్‌కి గురై సొమసిల్లి పడిపోయాడు.. ప్రస్తుతం ఏఐజీ వైద్యులు మెరుగైన చికిత్సనందిస్తున్నారు.. నాగ శౌర్య యాక్షన్ సీక్వెన్సెస్ షూట్ చేస్తుండగా ప్రమాదానికి గురవడం ఇంతకుముందు ‘అశ్వథ్థామ’ మూవీ అప్పుడు జరిగింది.. బిల్డిండ్ పైనుండి దూకుతుండగా కాలు విరిగింది.. ఇప్పుడు మళ్లీ ప్రమాదానికి గురవడం, అదికూడా పెళ్లికి ఐదు రోజుల ముందు ఈ సంఘటన జరగడంతో శౌర్య ఫ్యామిలీ, తనక్కాబోయే వధువు కుటుంబంతో పాటు అభిమానులు ఆందోళన చెందుతున్నారు..

కాగా ఇటీవలే తను పెళ్లి చేసుకోబోతున్నట్టు సడెన్‌గా అనౌన్స్ చేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. నవంబర్ 20న ముహూర్తం ఫిక్స్ చేశారు. కార్డులు కూడా పంచిపెట్టేస్తున్నారు.. బెంగళూరుకు చెందిన అనూష శెట్టి అనే అమ్మాయితో నాగ శౌర్య పెళ్లి జరగబోతుంది. అనూష బెంగళూరుకి చెందిన ఇంటీరియర్ డిజైనర్. న్యూయార్క్ స్కూల్ ఆఫ్ ఇంటీరియర్ డిజైన్ నుంచి కోర్సు చేసిన ఆమె బెంగుళూరులో సొంతంగా ఓ ఇంటీరియర్ డిజైనింగ్ సంస్థ నడుపుతోంది..

పెళ్లి ప్రకటన రాగానే అనూష గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కుటంబంతో తనకు మంచి రిలేషన్ ఉందని.. తారక్ తల్లి శాలిని, అనూష కర్ణాటక ప్రాంతానికి చెందినవారే కావడం విశేషం.. ఆమె తారక్‌ని అన్నయ్య అని పిలుస్తుందని ఓ ఇంటర్వూలో నాగ శౌర్యనే చెప్పడం జరిగింది. మరికొద్ది రోజుల్లో సంతోషంగా కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాడనుకుంటుండగా ఇలా జరిగింది.. శౌర్య త్వరగా కోలుకోవాలంటూ ఫ్యాన్స్, రిలేటివ్స్, ఇండస్ట్రీ వర్గాలవారు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus