Naga Shaurya: పవర్ ఫుల్ టైటిల్ తో నాగశౌర్య మూవీ.. హిట్టొస్తుందా?

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన నాగశౌర్య ఈ ఏడాది కృష్ణ వ్రింద విహారి సినిమాతో సక్సెస్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అంటే సుందరానికి సినిమాతో పోలికలు ఉండటం ఈ సినిమాకు ఒకింత మైనస్ అయింది. అయితే నాగశౌర్య కొత్త సినిమా రంగబలి అనే టైటిల్ తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. నాగశౌర్య ఈ సినిమా కోసం పవర్ ఫుల్ టైటిల్ ను ఎంచుకున్నారు,

తెలుగులో ఇండస్ట్రీ హిట్లుగా నిలిచిన రంగస్థలం, బాహుబలి సినిమాల టైటిల్స్ లోని పదాలతో ఈ టైటిల్ ను ఫిక్స్ చేయడం గమనార్హం. మాస్ మసాలా అంశాలతో ఈ సినిమా తెరకెక్కనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. కర్నూలు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాతో మాస్ ప్రేక్షకులకు కూడా దగ్గరవుతానని నాగశౌర్య కాన్ఫిడెన్స్ తో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రత్యేకమైన సెట్ వేసి ఈ సినిమాను షూట్ చేస్తున్నారని తెలుస్తోంది.

కొన్నిరోజుల క్రితం నాగశౌర్య పెళ్లి జరగగా త్వరలో నాగశౌర్య ఈ సినిమా కొత్త షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొననున్నారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సినిమాతో నాగశౌర్య ఖాతాలో బిగ్గెస్ట్ హిట్ చేరాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాలో హీరో పాత్రతో పాటు రంగ అనే మరో పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని బోగట్టా. ఈ రీజన్ వల్లే రంగబలి అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

నాగశౌర్య సినిమాలన్నీ భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతుండగా ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. నాగశౌర్య కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాగశౌర్య రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా నాగశౌర్య తర్వాత సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాల్సి ఉంది.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus