Naga Shaurya: నాగశౌర్య వరుసగా మూడోసారి మార్పు చేస్తున్నాడు!

టాలీవుడ్‌లో హీరోల్లో కంటిన్యూగా జోనర్‌లు మార్చుకుంటూ సినిమాలు చేసే హీరోలు చాలా తక్కువమంది ఉన్నారు. అయితే ప్రేమకథలు లేదంటే యాక్షన్‌ స్టోరీలు అంటూ ఓ కోవకే ఉండిపోయేవారు ఎక్కువగా ఉంటారు. అయితే మార్చుకునే కొద్ది మందిలో నాగశౌర్య ఒకరు. వరుసగా కొత్త కొత్త జోనర్‌లలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే ఫలితాలు ఎలా ఉన్నాయి అనే విషయం పక్కన పెట్టేయాలి. ఈ క్రమంలో మరో సినిమా అనౌన్స్‌ చేశాడు నాగశౌర్య.

ఇది కూడా గత సినిమా జోనర్‌కు ఏ మాత్రం సంబంధం లేనిది కావడం గమనార్హం. ముందుగా చెప్పినట్లు ప్ర‌తీసారి డిఫరెంట్ జోన‌ర్‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న నాగ‌శౌర్య‌ తన నెక్స్ట్‌సినిమా కోసం యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథను ఎంచుకున్నాడు. అరుణాచ‌లమ్ అనే ఓ డెబ్యూ డైరెక్ట‌ర్ కి అవ‌కాశం ఇచ్చాడు. ఈ సినిమాకి వైష్ణ‌వి ఫిల్మ్స్ అనే సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు సంబంధించినంతవరకు ఇంతకుమించి సమాచారం ఏమీ లేనప్పటికీ.. సినిమా మాత్రం కొత్తగా ఉంటుందని నాగశౌర్య టీమ్‌ చెబుతోంది.

ఇటీవల నాగశౌర్య సినిమాలు చేసుకుంటే… ‘ల‌క్ష్య‌’ స్పోర్ట్స్ డ్రామాతో వచ్చిన శౌర్య‌ ఆ వెంట‌నే ‘వ‌రుడు కావ‌లెను’ సినిమాతో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌ చేశాడు. తొలి సినిమా సరైన విజయం సాధించకపోయినా, రెండో సినిమా ఓకే. ఆ వెంటనే ‘కృష్ణ వ్రింద విహారి’ అనే డిఫ‌రెంట్ ల‌వ్ స్టోరీ చేశాడు. ఈ మూడు మూడు రకాల సినిమాలు.. ఇప్పుడు పై మూడు సినిమాలకు ఏమాత్రం సంబంధం లేకుండా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌కి పచ్చ జెండా ఊపేశాడు నాగశౌర్య.

ఇక నాగశౌర్య సినిమాల సంగతి చూస్తే.. ‘ఫ‌లానా అబ్బాయి.. ఫ‌లానా అమ్మాయి’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫుల్‌ స్వింగ్‌లో జరుగుతున్నాయి. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తారని సమాచారం. ఇది కాకుండా ‘నారీ నారీ నడుమ మురారి’, ‘పోలీసు వారి హెచ్చరిక’ అనే సినిమాలు ఆ మధ్య అనౌన్స్‌ చేశారు. కానీ వాటి సంగతి ఇంకా ఏం తేలడం లేదు.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus