Naga Shaurya, Keerthy Suresh: మెగాస్టార్ సినిమాలో ఛాన్స్.. ఒప్పుకుంటాడా..?

టాలీవుడ్ హీరో నాగశౌర్య తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఫీల్ గుడ్ కథలను ఎన్నుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కానీ రెండు సరైన విజయాలను అందించలేకపోయాయి. ప్రస్తుతం ఈ హీరో చేతుల్లో మూడునాలుగు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో సినిమా ఒప్పుకున్నట్లు సమాచారం. నాగశౌర్య హీరోగానే కాకుండా.. అప్పుడప్పుడు సినిమాల్లో స్పెషల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటాడు. ‘ఓ బేబీ’ సినిమాలో సమంత సరసన అలానే నటించారు.

ఇప్పుడు అలాంటిదే మరో ఆఫర్ శౌర్యకి వచ్చినట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ‘భోళాశంకర్’ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తోంది. ఆమె సరసన నటించడానికి నాగశౌర్యని సంప్రదించినట్లు తెలుస్తోంది. అయితే దీనికి శౌర్య ఒప్పుకున్నాడా..? లేదా అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మెగాస్టార్ సినిమాలో కీర్తి సురేష్ సరసన నటించే పాత్ర అంటే కచ్చితంగా ఆసక్తికరంగానే ఉంటుంది.

కాబట్టి శౌర్య ఒప్పుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో ఈ విషయంపై క్లారిటీ రానుంది. తమిళంలో తెరకెక్కిన ‘వేదాళం’ సినిమాకి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. అలానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలా మంది ఈ సినిమాలో కనిపించనున్నారు. రష్మీ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని సమాచారం.

శ్యామ్ సింగరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

83 సినిమా రివ్యూ & రేటింగ్!
వామ్మో.. తమన్నా ఇన్ని సినిమాల్ని మిస్ చేసుకుండా..!
‘అంతం’ టు ‘సైరా’.. నిరాశపరిచిన బైలింగ్యువల్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus