బాలయ్య కోసం మూగవాడి గెటప్ లో నాగశౌర్య!

యంగ్ హీరో నాగశౌర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేతుల్లో అరడజనుకి పైగా సినిమాలున్నాయి. కుటుంబ కథా చిత్రాలతో పాటు యాక్షన్ సినిమాలు కూడా చేస్తున్నాడు. అలానే స్పోర్ట్స్ డ్రామాలో ఓ సినిమా ఒప్పుకొని.. దానికోసం కండలు పెంచి రస్టిక్ లుక్ తో షాకిచ్చాడు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు శౌర్య లిస్ట్ లోకి మరో సినిమా వచ్చి చేరింది. నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న సినిమాలో శౌర్యని ఓ పాత్ర కోసం సంప్రదిస్తున్నారు. శౌర్య కూడా ఈ సినిమా విషయంలో ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

కన్నడ దర్శకుడు శ్రీమన్ వేముల ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో శౌర్య నలభై నిమిషాల పాటు కనిపించే పాత్ర అని తెలుస్తోంది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. సినిమా మొత్తం శౌర్య.. మూగ-చెవిటి వాడిగా కనిపిస్తాడట. అయితే ఈ పాత్ర ఎమోషనల్ గా కాకుండా ఫన్ తో కూడి ఉంటుందని టాక్. అందుకే ఈ పాత్ర శౌర్యకి బాగా నచ్చిందట. బాలకృష్ణ రోల్ మాత్రం పూర్తి నిడివితో ఉంటుందని తెలుస్తోంది.

అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాదిలో ఈ సినిమా పట్టాలెక్కుతోంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus