విజయం ఒంటరిగా రాదు. కొన్ని సార్లు వివాదాల్ని.. మరికొన్ని సార్లు విమర్శలను మోసుకొస్తుంది. అరుదుగా విజయ గర్వాన్ని వెంట తీసుకొస్తుంది. ఆ విజయ గర్వం సాయి పల్లవికి చిక్కులు తెచ్చి పెడుతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఆమెపై రూమర్లు తగ్గడం లేదు. మలయాళంలో ప్రేమమ్ తో క్రేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తెలుగులో ఫిదాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ హిట్ సాయి పల్లవి వల్ల వచ్చిందని కొంతమంది మీడియాలో రాయడం వల్ల ఆమెకి పొగరు తలకెక్కినట్లు ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. అందుకే ఆమె నెక్స్ట్ సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి షూటింగ్ సమయంలో ఎవరి మాట వినకుండా సాయి పల్లవి చిత్ర బృందానికి చుక్కలు చూపించినట్లు సమాచారం.
అలాగే దీని తర్వాత నాగశౌర్య తో కలిసి కణం అనే ద్వి భాష చిత్రాన్ని చేసింది. ఈ మూవీ త్వరలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన నాగశౌర్య సాయి పల్లవి గురించి సంచలన కామెంట్స్ చేశారు. “సాయి పల్లవి ఇతరులతో గొడవ పడిన సంగతి నాకు తెలియదు కానీ.. నా సినిమా షూటింగ్ సమయంలోను సాయి పల్లవితో గొడవలు వచ్చాయి” అని స్పష్టం చేశారు. అలాగే మరో రూమర్ పై మాట్లాడుతూ.. ఫిదా చిత్ర సక్సస్ క్రెడిట్ ఒక్క సాయి పల్లవిదే కాదని అన్నారు. శేఖర్ కమ్ముల అలాంటి కథ రాయకున్నా, వరుణ్ తేజ్ సెటిల్డ్ ఫెర్ఫామెన్స్ చేయకున్నా సినిమా హిట్ అయ్యేది కాదని, కాబట్టి సాయి పల్లవిది మాత్రమే క్రెడిట్ అనడం సరికాదని వివరించారు. మరి ఈ కామెంట్స్ పై సాయి పల్లవి ఎలా స్పందిస్తుందో చూడాలి.