పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 12 ఏళ్ళుగా సరైన హిట్టు లేని పవన్ కళ్యాణ్ కి.. కమర్షియల్ సక్సెస్ అందించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో.. అవి ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేశాయి.
ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అప్పటివరకు ఉన్న ల్యాగ్ ను కూడా మరిపించింది అని చెప్పాలి. అయితే ”ఓజి’ ఇంటర్వల్లో అంత భీభత్సంగా ఏముంది? అందరూ తెగ చూసేసారు’ అంటున్నాడు ఓ స్టార్ నిర్మాత. అతను మరెవరో కాదు ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ. ‘ ‘అతనొక్కడే’ సినిమా నుండి .. ‘డాకు మహారాజ్’ వరకు చాలా సినిమాల్లో హీరో తలనరికే ఎపిసోడ్స్ ఉన్నాయని’ నాగవంశీ చెప్పుకొచ్చారు.
అయితే ఆ సీన్ కి తగ్గట్టు మూడ్ క్రియేట్ చేస్తే అవి ఆడియన్స్ కి నచ్చేస్తున్నాయని నాగ వంశీ అభిప్రాయపడ్డారు. నాగవంశీ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.తన ‘మాస్ జాతర’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగవంశీ ఈ కామెంట్స్ చేయడం జరిగింది. అక్టోబర్ 31న ‘మాస్ జాతర’ రిలీజ్ కానుంది.
రవితేజ, శ్రీలీల జంటగా నటించిన ఈ సినిమాతో భాను భోగ వరపు దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా ఆగస్టు 27నే రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 31 కి వాయిదా వేశారు. రవితేజ కెరీర్లో ఇది 75 వ సినిమా కావడం విశేషంగా చెప్పుకోవాలి.