త్రివిక్రమ్ – అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమాను తారక్ – త్రివిక్రమ్ చేస్తున్న విషయం తెలిసిందే. రకరకాల పుకార్లు, ఇంటెన్సనల్లీ చేసిన లీకుల ప్రకారం ఈ సినిమాను ఇటీవల నిర్మాత నాగవంశీ అనౌన్స్ చేశారు. అంతకుముందు పుకార్లకు బలం చేకూర్చేలా తారక్ ఆ సినిమా నేపథ్యానికి సంబంధించిన పుస్తకాన్ని పట్టుకుని బయట కనిపించడం మనకు తెలిసిందే. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎలా ఉంటుంది, ఏమౌతుంది అనేది పక్కన పెడితే.
ఆ ప్రాజెక్ట్ చేతులు మారడం, దాని గురించి నిర్మాత నాగవంశీ మాటల్లో ‘మార్పులు’ ఇప్పుడు పెద్ద చర్చకు, ఇంకా చెప్పాలంటే రచ్చకు కారణమయ్యాయి. అందరికీ తెలిసిన విషయమే మళ్లీ గుర్తు చేస్తున్నాం. తారక్ – త్రివిక్రమ్ సినిమా కార్తికేయుని జీవితం ఆధారంగా తెరకెక్కిస్తారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది ఇదే సమయానికి సినిమా షూటింగ్ మొదలవుతుంది.
అయితే రీసెంట్‌గా నాగవంశీ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమా కథ, గతంలో బన్నీతో త్రివిక్రమ్ చేస్తానన్న కథ ఒకటి కాదు అని చెప్పారు. దీంతో బన్నీ అభిమానులు పాత వీడియోలు తవ్వడం మొదలుపెట్టారు. అందులో క్లియర్‌గా కాకపోయినా ఈ సినిమా కార్తికేయుని కథే అని నాగవంశీ చెప్పారు. దీంతో మాట మార్చిన నాగవంశీ అంటూ ట్రోలింగ్ మొదలుపెట్టారు. అయితే, ఈ ట్రోలింగ్, ఫైటింగ్ నాగవంశీకి కొత్తేం కాదు. గతంలో వివిధ సందర్భాల్లో ఇలాగే నోరు జారి, నాలుక మడతేసి మాటలు పడ్డారు.
అయితే ఇద్దరు మంచి స్నేహితులు అయిన హీరోల ఫ్యాన్స్ మధ్యలో ఇరుక్కున్నారు. అందుకే ఆయనకేమైనా లాసా అంటే ఏమీ లేదు. కానీ ఇంకా పాత జమానా ఉంది అనుకుని.. ఏదేదో అనేసి తర్వాత కొన్ని రోజులకు నేను అలా అనలేదు అని మాట మారిస్తే పేజీలు స్క్రోల్ చేసి చేసి అప్పటి వీడియోలు వెతికేస్తారు నెటిజన్లు. కాబట్టి ఆయన ఊరకనే ట్రోలింగ్ మెటీరియల్ అవ్వకుండా ఉంటే ఆయనే ప్రశాంతం.