Naga Vamsi: ‘కింగ్డమ్’ సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన నాగ వంశీ !

‘సితార ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలో సీక్వెల్స్ హవా మొదలైంది. ఇప్పటికే ‘డిజె టిల్లు’ కి (DJ Tillu)  సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ (Tillu Square) వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. త్వరలో ‘మ్యాడ్’ కి (MAD)  సీక్వెల్ అయిన ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) కూడా రాబోతోంది. అలాగే విజయ్ దేవరకొండ 12 వ సినిమా ‘కింగ్డమ్’ కి కూడా సీక్వెల్ ఉంటుంది అంటూ ప్రచారం జరిగింది. దీనిపై నాగవంశీ క్లారిటీ ఇచ్చాడు. ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రమోషన్స్ కోసం చేసిన ఓ కామన్ ఇంటర్వ్యూలో..

Naga Vamsi

హీరోల్లో ఒకరైన సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) .. ” ముందు ‘టిల్లు’ వచ్చింది. తర్వాత ‘టిల్లు స్క్వేర్’ తో సీక్వెల్ తీశారు. సీక్వెల్స్ కి ‘2’ అని కాకుండా ‘స్క్వేర్’ అని పెట్టి సీక్వెల్స్ చేసే ట్రెండ్ తీసుకొచ్చారు. ‘టిల్లు’ కి సీక్వెల్ గా ‘టిల్లు స్క్వేర్’ అని పెట్టినట్టే, ‘మ్యాడ్’ కి సీక్వెల్ గా ‘మ్యాడ్ స్క్వేర్’ అని పెట్టారు. ఇప్పుడు బయట ‘కింగ్డమ్’ కి(Kingdom) కూడా సీక్వెల్ ఉంటుంది అనే రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఒకవేళ అందులో నిజం ఉంటే.. దానికి కూడా ‘కింగ్డమ్ స్క్వేర్’ అనే టైటిల్ పెడతారా?” అంటూ నాగవంశీని (Suryadevara Naga Vamsi ) ప్రశ్నించాడు. అందుకు నాగవంశీ.. ” ‘కింగ్డమ్’ సెకండ్ పార్ట్ అనేది రూమర్ కాదు. ఆ సినిమా కథే 2 పార్టుల కథ. సెకండ్ పార్ట్ తీయాలి అని భావించి.. దాని నిడివి పెంచి రెండు పార్టులుగా చేసిన కథ కాదు ఇది. గౌతమ్ (Gowtam Naidu Tinnanuri) ‘ఇది పార్ట్ 1 కథ అండి ఇది..

తర్వాత దానికి సెకండ్ పార్ట్ స్క్రీన్ ప్లే వేరుగా ఉంటుంది. అయితే దానికి ‘2’ పెడతామా లేక ‘స్క్వేర్’ అని పెడతామా? అనేది ‘కింగ్డమ్’ రిలీజ్ అయ్యాక.. దాని రిజల్ట్ ను బట్టి డిసైడ్ చేస్తాం. ‘మ్యాడ్ స్క్వేర్’ లో లాజిక్కులు వంటివి ఆశించి చూడకూడదు. కానీ ‘కింగ్డమ్’ లో లాజిక్కులు స్క్రీన్ ప్లే…లు, గ్రాండియర్, యాక్షన్ వంటి రివ్యూయర్స్ కి ఉండే టిక్ బాక్సులన్నీ ఫుల్-ఫిల్ చేసే సినిమా ‘కింగ్డమ్’ ” అంటూ చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus