Naga Vamsi: బాలయ్య ఫ్యాన్ గా చెబుతున్నా.. నిర్మాత నాగ వంశీ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi) అలియాస్ సితార నాగవంశీ..ఏం మాట్లాడినా చాలా బోల్డ్ గా ఉంటుంది. ఎంతో ఫ్రస్ట్రేషన్ ని అనుభవిస్తున్నట్టు కనిపించే నాగ వంశీ.. మాటల విషయంలో కొలతలు వేసుకోడు. అతనికి ఏది అనిపిస్తే అది మాట్లాడేస్తాడు. వాస్తవానికి అందులో చాలా సెన్సిబుల్ గా ఉంటాయి. ఇంకొన్ని డైజెస్ట్ చేసుకోవడానికి టైం పడతాయి. ఉదాహరణకి ‘గుంటూరు కారం’ సినిమా రిజల్ట్ విషయంలో అతను మాట్లాడింది నిజం కాలేదు. కానీ మొదట అనుకున్న కథ వేరు..

Naga Vamsi

తర్వాత మార్పులు జరగడం వల్ల అతని స్టేట్మెంట్ తప్పయ్యింది. ఇక టికెట్ రేట్ల విషయంలో నాగవంశీ మాట్లాడిన విధానాన్ని కూడా చాలా మంది తప్పుబట్టారు. అంతేకాదు ‘ఇక పెద్ద సినిమాలకి హిట్ టాక్ రాదని.. ఏదో ఒక విధంగా అందులోని లోపాలు వెతకడానికి చూస్తారు’ అంటూ వ్యక్తం చేసిన అతని అభిప్రాయాన్ని కూడా చాలా మంది తప్పుబట్టారు.

సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ఈరోజు జరిగిన ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj)  మీడియా సమావేశంలో చిరు ఫ్యాన్స్ గురించి నాగ వంశీ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఓ సందర్భంలో నాగ వంశీ మాట్లాడుతూ.. ” ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) సినిమా కంటే కూడా ‘డాకు మహారాజ్’ బాగుంటుంది. చిరంజీవి (Chiranjeevi)  ఫ్యాన్స్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు.

చిరంజీవి ఫ్యాన్ అయినటువంటి దర్శకుడు బాబీ (Bobby) .. ‘డాకు మహారాజ్’ ని చాలా బాగా తీశాడు అని బాలకృష్ణ అభిమాని అయినటువంటి నేను హానెస్ట్ గా చెబుతున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. స్వతహాగా ఎన్టీఆర్ (NTR) , బాలకృష్ణ..లకి  (Nandamuri Balakrishna) నాగ వంశీ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. అతని ఫ్యానిజాన్ని ఈ రకంగా బయటపెట్టాడు నాగవంశీ.

‘సలార్’ ‘పుష్ప 2’.. సినిమాల్లో ఈ కామన్ పాయింట్ ని గమనించారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus