టాలీవుడ్ లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ.. ఇప్పటినుండే హడావిడి మొదలైంది. ఈ ఎన్నికల్లో మెగాబ్రదర్ నాగబాబు.. ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలుపుతున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ ‘మా’ వివాదంపై మాట్లాడడంతో మళ్లీ ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు ఏకగ్రీవం చేయాలనే డిమాండ్ వస్తోంది. మురళీమోహన్ కూడా ఇదే అన్నారు. మంచు విష్ణు కూడా ఏకగ్రీవం జరిగితే పోటీ నుండి తప్పుకుంటానని అన్నారు.
తాజాగా నాగబాబు ‘మా’ ఎన్నికల వివాదాలపై మాట్లాడారు. ఎలెక్షన్స్ ఏకగ్రీవం అనడం చాలా తప్పని.. అలాగైతే దేశం, రాష్ట్రాల్లో ఎలెక్షన్స్ ఎందుకని.. అన్నీ ఏకగ్రీవం చేసేయొచ్చు కదా అంటూ సెటైర్ వేశారు. పోటీ జరిగితేనే బాగుంటుందని అన్నారు. ఎవరు గెలిచినా.. కలిసే పని చేస్తామని.. మోహన్ బాబు, మేమంతా కలిసే ఉంటామని అన్నారు. ప్రతిరోజూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటామని అన్నారు.
రౌడీయిజం, బెదిరింపులు ఉంటేనే ఏకగ్రీవాలు అవుతాయని.తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇక ‘మా’ అసోసియేషన్ అనేది ఒక వైట్ పేపర్ లాంటిదని.. ఎవరైనా వెళ్లి అకౌంట్స్ అడగొచ్చని.. అక్కడ డబ్బు దుర్వినియోగం జరిగిందనే మాట కరెక్ట్ కాదని అన్నారు. శివాజీరాజా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ‘మా’ అసోసియేషన్ కోసం ఫండ్స్ సేకరించి.. వాటిని వెల్ఫేర్ కోసం ఉపయోగించినట్లు చెప్పారు. కానీ నరేష్ టర్న్ లో పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదని అన్నారు.
Most Recommended Video
పెళ్లి దాకా వచ్చి విడిపోయిన జంటలు!
తమిళ హీరోలు తెలుగులో చేసిన స్ట్రైట్ మూవీస్ లిస్ట్!
దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్స్