Nagababu: వదిన సురేఖ సపోర్ట్ ఎప్పుడు మాకు ఉంటుంది!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. మెగా కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. అయితే మెగా స్టార్ చిరంజీవి సతీమణి సురేఖ గురించి కూడా అందరికీ ఎంతో సుపరిచితమే చిరంజీవి సినిమాలపరంగా ఎంతో బిజీగా ఉండగా ఈమె కుటుంబ బాధ్యతలు అన్నింటిని ఎంతో చక్కగా నిర్వర్తిస్తూ చిరంజీవి విజయానికి కూడా దోహదమయ్యారని చెప్పాలి.

ఈ విధంగా సురేఖ నాగబాబు పవన్ కళ్యాణ్ వంటి వారికి వదినలా కాకుండా ఒక తల్లిగా బాధ్యతలు తీసుకొని వారి బాగోగులు చూసుకుంటారు అంటూ ఇదివరకు ఎన్నో సందర్భాలలో వెల్లడించారు తాజాగా నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సురేఖ గురించి కొన్ని విషయాలు తెలియజేశారు. తనకు అన్నయ్యతో గొడవ జరిగినప్పుడు తన వదిన సపోర్ట్ నాకే ఉంటుంది అంటూ నాగబాబు ఈ సందర్భంగా కామెంట్ చేశారు.

ఏదైనా ఒక విషయం గురించి నేను అన్నయ్య డిస్కషన్ చేసుకున్నప్పుడు కొన్నిసార్లు నేను నా అభిప్రాయాలను తెలియజేస్తాను అయితే అవి నచ్చితే అన్నయ్య ఓకే అంటారు లేకపోతే నాతో వాదనకు దిగుతారు నేను కూడా కొన్నిసార్లు అన్నయ్య నిర్ణయాలను ఏకీభవించను ఆ సమయంలో మా ఇద్దరి మధ్య చిన్నపాటి డిస్టబెన్స్ వస్తుంది. అలాంటి సమయంలో మా ఇద్దరి మధ్య మా వదిన నిలబడి నాకు సపోర్ట్ చేసి వదిలేయండి పోనీలెండి అంటూ అన్నయ్యకు సర్ది చెబుతారని నాగబాబు వెల్లడించారు.

మా ఇంట్లో ఏదైనా ఫ్యామిలీ వేడుక జరిగిన నేను తప్పకుండా అక్కడ ఉండాలని మా వదిన కోరుకుంటారు. నేను ఎంతో బాగా నవ్విస్తూ ఉంటానని ఆమె భావిస్తూ ఉంటారు. నా ఒక్క విషయంలోనే కాదు పవన్ విషయంలో కూడా వదిన సపోర్ట్ ఎప్పుడూ తనకే ఉంటుందని తెలిపారు. ఇక తనని ఒక మరిదిలా కాకుండా సొంత కొడుకుల పెంచిందని నాగబాబు (Nagababu) ఈ సందర్భంగా సురేఖ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గత 10 సినిమాల నుండి రామ్ బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే..?

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ శుభ శ్రీ గురించి ఈ 14 విషయాలు మీకు తెలుసా?
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ టేస్టీ తేజ గురించి 10 ఆసక్తికర విషయాలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus