Naga Babu: నీహారిక ఎలాంటి తప్పు చేయలేదు.. నాగబాబు క్లారిటీ!

ఆదివారం నాడు టాస్క్ ఫోర్స్ పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. అందులో భాగంగా హైదరాబాద్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా హోటల్ లోని ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్‌లో డ్రగ్స్ బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. ఈ దాడులలో పోలీసులు 142 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇలా పట్టుబడిన వారిలో నాగబాబు కూతురు నీహారిక, టీడీపీ మాజీ ఎంపీ కుమారుడు, బిగ్ బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు.

Click Here To Watch NOW

నీహారిక పట్టుబడడంపై సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆమె తండ్రి నాగబాబు వీడియో బైట్ ద్వారా వివరణ ఇచ్చారు. ఆయనేం మాట్లాడారంటే.. ‘గత రాత్రి రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన సంఘటనపై నేను స్పందించడానికి కారణం నా కూతురు నిహారిక ఆ సమయానికి అక్కడ ఉండటమే. పబ్ టైమింగ్‌ను ప‌రిమితికి మించి న‌డ‌ప‌టం వ‌ల్ల పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. నిహారిక‌కు సంబంధించినంత వ‌ర‌కు త‌ను చాలా క్లియ‌ర్‌.

ఇక్క‌డ పోలీసులు ఇచ్చిన స‌మాచారం మేర‌కు నిహారిక విష‌యంలో ఎలా త‌ప్పు లేద‌ని చెప్పారు. సోష‌ల్, మెయిన్ స్ట్రీమ్ మీడియాల్లో ఎలాంటి అన‌వ‌స‌ర‌మైన పుకార్ల‌కు తావు ఇవ్వ‌కూడ‌ద‌ని నేను వీడియో రిలీజ్ చేస్తున్నాను. ద‌య‌చేసి అన‌వ‌స‌ర‌మైన పుకార్ల‌ను పుట్టించ‌వ‌ద్ద‌ని నా రిక్వెస్ట్” అని తెలిపారు.అయితే ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్ ను భారీ ఎత్తున ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.

అక్కడున్న వారి వివరాలను సేకరించిన తరువాత పోలీసులు వారిని విడిచిపెట్టారు. అలానే పట్టుబడినవారిలో 45 మందిపై పోలీసులకు అనుమానం ఉండడంతో వారి బ్లడ్ శాంపిల్స్ ని సేకరిస్తామని చెబుతున్నారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus