లుక్‌ టెస్ట్‌ చేస్తున్నాడా… హింట్‌ ఇస్తున్నాడా?

ఇన్‌స్టాగ్రామ్‌ స్టేటస్‌లతో ఈ మధ్య హడావుడి చేసిన మెగా బ్రదర్‌ నాగబాబు… కొన్ని ఫొటోలు కూడా పోస్ట్‌ చేస్తున్నారు. తాజాగా ఆయన పోస్ట్‌ చేసిన ఫొటోలు వైరల్‌గా మారాయి. అవి అతని ఫొటోలే కావడం గమనార్హం. రగ్‌డ్‌ లుక్‌లో ఉన్న నాగబాబును చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. కొత్త సినిమా లుక్‌ అని కొందరు, సరదాగా దిగిన ఫొటోలు అని మరికొందరు అంటున్నారు. అయితే వీటిపై నాగబాబు నుండి ఎలాంటి స్పందన రాలేదు. మరి దీనిపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తే…

నాగబాబు కొత్త ఫొటోలు పెట్టడం ఇదేం కొత్తకాదు. ఓ పది రోజుల క్రితం కూడా సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌ లుక్‌ అంటే తెలుగు గడ్డంతో మాస్‌ ఫొటోలు కొన్ని పోస్ట్‌ చేశారు. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు కొత్త ఫొటోలు పోస్ట్‌ చేశారు. మొదట పెట్టిన ఫొటోలు క్లాస్‌ విలన్‌ లుక్‌లో ఉంటే, ఇప్పటి ఫొటోలు మాస్‌ లుక్‌లో ఉన్నాయి. కాబట్టి ఈరెండూ ఒకే సినిమాలోని కావడం కష్టం. వేర్వేరు సినిమాల్లోని అనుకుంటే… ఈ మధ్య నాగబాబు కొత్త సినిమా ఒప్పుకున్నట్లు ఎక్కడా వార్తలు లేవు.

మరి సినిమా కాకుండా నాగబాబు ఏదైనా వెబ్‌సిరీస్‌ లాంటిది చేస్తున్నారా? అనే ప్రశ్న కూడా వస్తోంది. ఆ వెబ్‌సిరీస్‌ లుక్‌ టెస్ట్‌ కోసమే నాగబాబు ఈ ఫొటోలు దిగారని అంటున్నారు. లేక వెబ్‌సిరీస్‌ అయిపోయిందని… త్వరలో ఈ లుక్‌లో మీ ముందుకు వస్తానని హింట్‌ ఇస్తున్నాడా? అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. బాబు గారూ… ఏదో క్లారిటీ ఇచ్చేయొచ్చు కదా.


Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus