పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు, మరోపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఆయన సొంతంగా పార్టీ పెట్టి దాదాపు తొమ్మిదేళ్లు అవుతుంది. అధికారంలో ఉండకుండా ఇన్నేళ్ల పాటు పార్టీని నడిపించడమంటే మాములు విషయం కాదు. వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు మాత్రమే రాజకీయ పార్టీలను నడపగలరనే టాక్ జనాల్లో ఉంది. ఈ విషయంపై నాగబాబు క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఓ మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ కి ఎన్ని వేల కోట్లు ఆస్తులు ఉండొచ్చని యాంకర్ అడగ్గా.. దానికి నాగబాబు.. ఏ సినిమా చేసినా ఆ వచ్చిన డబ్బులో తను బతకడం కోసం కొంత ఉంచుకొని, మిగతా డబ్బులు ప్రజలకే ఖర్చు పెట్టేస్తానని అన్నారు. పార్టీ కోసమో, ప్రజల కోసమో, మిలిటరీ వాళ్ల కోసమో, తుఫాను లాంటి వైపరీత్యాలు వచ్చినప్పుడు వ్యక్తిగతంగా విరాళాలు ఇచ్చేస్తుంటారని అన్నారు. ఇండస్ట్రీలో కూడా ఎవరికైనా సాయం కావాలంటే చేస్తారని.. ఇప్పుడు రైతుల కోసం ఇచ్చారని, అంతకు ముందు ఇప్పటం ప్రజలకు, ఉద్దానం కిడ్నీ బాధితులకు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
తనకు వీలైనంత వరకు సాయంలో ఉన్నవారికి డబ్బు పంచుకుంటూ వెళ్తారని.. తన దగ్గర ఏదీ ఉంచుకోరని అన్నారు. పవన్ కి సినిమా నుంచి వచ్చే ఆదాయం తప్ప వేరే వ్యాపారాలు లేవని అన్నారు. అప్పట్లో మాదాపూర్ లో ఎకరం లక్ష రూపాయలు ఉండేదని.. అప్పుడే పవన్ కోటి పెట్టి భూములు కొని ఉంటే వేల కోట్లు ఆస్తులు ఉండేవని.. కానీ ప్రజల కోసం పోరాడే నాయకుడికి ఆస్తులు ఉంటే అది అడ్డుపెట్టుకొని ట్విస్ట్ చేస్తారని.. అందుకే పవన్ కళ్యాణ్ ఆస్తులపై ప్రేమ పెంచుకోలేదని అన్నారు. సినిమా అయిపోతే పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు ఉండవని.. డబ్బు కావాలంటే మళ్లీ సినిమా చేస్తారని.. మిగతా నాయకుల్లా పవన్ కి వ్యాపారాలు లేవని అన్నారు.
పార్టీ కార్యకర్తలు ఇచ్చే ఫండ్స్, పవన్ కళ్యాణ్ రెమ్యునరేషన్ ఇవే పార్టీని నడుపుతున్నాయని చెప్పారు. ఈ డబ్బునే ప్రజల కోసం ఖర్చు పెడతారు తప్ప వేరే ఆదాయమార్గం లేదని చెప్పుకొచ్చారు. పవన్ కి అసలు ఆస్తులే లేవా..? అని యాంకర్ అడగ్గా.. ప్రస్తుతం పవన్ ఉంటున్న ఇల్లు ఫైనాన్స్ లో ఉందని.. ఇక శంకరపల్లిలో 15 లక్షలో, 16 లక్షలో పెట్టి ఒక ల్యాండ్ కొన్నారని.. అది వ్యవసాయం చేయాలనే ఆసక్తితో కొనుక్కున్నారని చెప్పారు. ఆ ల్యాండ్ తప్ప పవన్ కి సంబంధించిన ఆస్తులన్నీ తాకట్టులోనే ఉన్నాయని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ కూడా ఫైనాన్స్ కి డబ్బు తీసుకొచ్చి కట్టారని చెప్పుకొచ్చారు.
వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!
‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?